Vijay Sarathi: మాజీ మంత్రికి వారసుడు నేనే..
ABN, First Publish Date - 2023-05-24T10:00:40+05:30
40 ఏళ్లుగా నివాసముంటూ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తమిళనాడు మాజీ మంత్రి
నాగలాపురం(చెన్నై): సత్యవేడులో 40 ఏళ్లుగా నివాసముంటూ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తమిళనాడు మాజీ మంత్రి విజయ సారథి(Former Minister Vijay Sarathi)కి తానే వారసుడునని అరక్కోణం ప్రాంతానికి చెందిన ప్రభు ప్రకటించారు. నాగలాపురంలో మంగళవారం తన సతీమణితో కలిసి ప్రభు విలేకరులతో మాట్లాడారు. విజయసారథికి సంతానం లేని కారణంగా ఆయన చెల్లెలు కుమారుడునైన తనను 1982లో దత్తత తీసుకున్నారని వివరించారు. విజయ సారథికి సంబంధించిన ఆస్తులను ఆయన మరణానంతరం మాజీ ఎమ్మెల్యే హేమలత నకిలీ సర్టిఫికెట్లతో విక్రయించుకున్నారని ఆరోపించారు. వాస్తవానికి వ్యాపార విషయాల్లో విజయసారథి(Vijayasarathi)తో హేమలతకు పరిచయాలుండేవన్నారు. ఈ వైనంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తిరుపతి, తిరువళ్లూరు కలెక్టర్లకు ఫిర్యాదు చేశానన్నారు. తమిళనాడు హైకోర్టులో కేసు కూడా దాఖలైనట్లు తెలిపారు.
Updated Date - 2023-05-24T10:00:42+05:30 IST