Viral News: కొడుకు ఏదో చేస్తున్నాడని డౌట్.. ఎవరికీ తెలియకుండా అతడి గదిలో సీసీ కెమెరాలను ఆ తండ్రి ఏర్పాటు చేయిస్తే..

ABN , First Publish Date - 2023-03-29T14:18:56+05:30 IST

కొడుకు లేని సమయంలో గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేయించాడు. ఆ తరువాత సీసీకెమెరా రికార్డ్ పరిశీలించి కొడుకు చేస్తున్న పనికి

Viral News: కొడుకు ఏదో చేస్తున్నాడని డౌట్.. ఎవరికీ తెలియకుండా అతడి గదిలో సీసీ కెమెరాలను ఆ తండ్రి ఏర్పాటు చేయిస్తే..

ఇప్పట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రత్యేకంగా గదులు కేటాయిస్తున్నారు. పిల్లల చదువుకు ఎలాంటి డిస్టర్బ్ ఉండకూడదని వారి అభిప్రాయం. ఓ తండ్రి తన కొడుకు చక్కగా చదువుకోవాలని ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయించాడు. కానీ గదిలో కొడుకు చదువుకోవడం లేదని ఆ తండ్రికి డౌట్. 'చదువుకోకుండా వీడేం చేస్తున్నాడో తెలుసుకోవాలి' అని ఆయన డిసైడ్ అయ్యాడు. కొడుకు లేని సమయంలో గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేయించాడు. ఆ తరువాత సీసీకెమెరా రికార్డ్ పరిశీలించి కొడుకు చేస్తున్న పనికి అవాక్కయ్యాడు. మా నాన్న నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్ననాడు అంటూ ఆ కుర్రాడే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేది ఒకటైతే పిల్లలు చేసే పనులు వేరు ఉంటాయి. చదువుకోండి ఫస్ట్ అంటే..చదువుకోవడం తప్ప అన్ని పనులు చేస్తారు. ఓ కుర్రాడు రెడ్డిట్ట్(Reddit) అనే ప్లాట్ ఫామ్ లో తన తండ్రి చేసిన పనిని షేర్ చేసుకున్నాడు. 'నేను చదువుతున్నానో లేదోనని మానాన్నకు అనుమానం. అందుకే గదిలో సీసీకెమెరా(CC camera) ఏర్పాటుచేయించాడు. గతంలో నేను మా అన్న గదిలో చదువుకునే వాడిని. రాత్రి 3గంటల వరకు చదువుకుని ఆ తరువాత గేమ్స్ ఆడుకునేవాణ్ణి. అదే అలవాటులో ఒకరోజు 3గంటల వరకు చదువుకుని పియస్4(PS4)లో గేమ్స్ ఆడుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ సంఘటన తరువాత ఆయన నా గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేయించాడు. నా పుట్టిన రోజు కూడా నేను ఇలాగే గేమ్స్ ఆడుతూ పట్టుబడ్డాను. కానీ నేను నా క్లాస్ లో టాప్ టెన్ స్టూడెంట్స్ లో ఒకడిని, నా స్కోర్ ఎప్పుడూ 90శాతం పైనే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేసిన ఫోటోను అతను షేర్ చేశాడు. ఆ అబ్బాయి చెప్పి న విషయం విని, ఆ ఫోటో చూసిన వారు అబ్బాయి తండ్రి మీద విమర్శలు గుప్పించారు. తల్లిదండ్రులు మరీ ఇంత కఠినంగా ఉండకూడదని కామెంట్స్ చేస్తున్నారు.

Read also: Marry now Pay Later Scheme: పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లకు బంపరాఫర్.. వివాహానికి ప్రత్యేక లోన్లు.. 6 నెలల్లోపు చెల్లిస్తే వడ్డీ ఉండదట..!


Updated Date - 2023-03-29T14:19:45+05:30 IST