Viral News: 3 రూపాయల కోసం ఆశపడితే.. చివరకు రూ.25 వేలు మటాష్.. జిరాక్స్ షాపులో కనివీని ఎరుగని ఘటన..!
ABN , First Publish Date - 2023-09-29T16:40:33+05:30 IST
చిల్లర తిరిగి ఇవ్వమని ఎంత అడిగినా దుకాణాదారుడు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే..
కొందరు దుకాణాదారులు తమ కస్టమర్లను మోసం చేస్తుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దబాయిస్తారు కూడా. ఒక వ్యక్తి ఒక కాగితం కాపీ తీయించుకోవడానికి జిరాక్స్ షాపుకు వెళ్లాడు. అక్కడ అతను రూ. 5 చెల్లించగా మిగిలిన చిల్లర ఇచ్చే విషయంలో దుకాణాదారుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. తనకు చిల్లర తిరిగి ఇవ్వమని అతను పదే పదే అడిగినా దుకాణాదారుడు ఇవ్వలేదు. దీంతో కొనుగోలు దారుడు చేసిన పనికి ఆ దుకాణాదారుడికి దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటన ఎంతోమంది దుకాణాదారులకు చెంప పెట్టుగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఒడిషా(Odisha) రాష్ట్రం సంబల్ పూర్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సంబల్ పూర్ లో స్థానికంగా నివసిస్తున్న జర్నలిస్ట్ ప్రపుల్ల కుమార్ దాస్ ఏప్రిల్ 28వ తేదీన ఒక కాగితం జిరాక్స్ కాపీ(Xrox copy) తీయించుకోవడానికి గోయల్ ప్రింటింగ్ కు వెళ్లాడు. అక్కడ దుకాణాదారుడికి రూ. 5 ఇచ్చాడు. ఒక కాగితం జిరాక్స్ ధర రూ.2 మాత్రమే కావడంతో మిగిలిన రూ. 3 వెనక్కు ఇవ్వమని అడిగాడు. కానీ దుకాణాదారుడు చిల్లర ఇవ్వలేదు. దీంతో ప్రపుల్ల కుమార్ తనకు చిల్లర వెనక్కు ఇవ్వమని పదేపదే అడిగాడు. అతను పదేపదే అడగడంతో దుకాణాదారుడు ప్రపుల్ల కుమార్ ను దుర్బాషలాడాడు. ఆ తరువాత మొత్తం 5 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. అతను ఎలాంటి రసీదు లేదా బిల్లు ఇవ్వలేదు. దీంతో ప్రపుల్ల కుమార్ రూ. 5 తీసుకోకుండా వెనక్కు వచ్చేశాడు. ఆ దుకాణాదారుడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
Buying Flat: ఫ్లాట్‌ను కొనే ఆలోచనలో ఉన్నారా..? ఈ టిప్స్‌ను ఫాలో అయితే డబ్బుల ఖర్చు తగ్గడం గ్యారెంటీ..!
కస్టమర్ ను అవమానించడం, దుర్బాషలాడి వేధించడం, మానసిక వేదనకు గురిచేయడం, మార్కెట్ రేటుతో పోలిస్తే అధిక డబ్బు వసూలు చేస్తుండటం వంటి ఆరోపణలతో వినియోగదారుల కోర్టును(Consumer Dispute court) ఆశ్రయించాడు. కోర్టులో జరిగిన విచారణ అనంతరం దుకాణాదారుడు ప్రపుల్ల కుమార్ కు జిరాక్స్ కాపీకి పోనూ మిగిలిన రూ. 3 ను అతనికి తిరిగి చెల్లించాలని చెప్పారు. అంతేకాదు దుకాణాదారుడి చర్య కారణంగా ప్రపుల్ల కుమార్ మానసిక వేదనకు గురయ్యాడని, అతడిని అవమానించినందుకు, అతనికి డబ్బు తిరిగి ఇవ్వనందుకు రూ. 25వేలు పరిహారంగా(25thousand compensation) ప్రపుల్ల కుమార్ కు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ఇచ్చిన 30రోజులలోపు ఆ డబ్బు చెల్లించని పక్షంలో, ఆ డబ్బు చెల్లించేలోపు ప్రతి సంవత్సరం 9శాతం వడ్డీని దుకాణాదారుడు ప్రపుల్ల కుమార్ కు చెల్లించాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కోర్టు తీర్పు తర్వాత ప్రపుల్ల కుమార్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ తీర్పు అవినీతి దుకాణాదారులకు మంచి గుణపాఠం అవుతుందని చెప్పుకొచ్చాడు.