Viral Video: 7 కిలోమీటర్ల క్యూ.. 9 గంటల పాటు నిరీక్షణ.. ఒక్క రుద్రాక్ష కోసం జనాలు ఎందుకింతగా ఎగబడుతున్నారంటే..
ABN , First Publish Date - 2023-02-17T19:59:26+05:30 IST
ఇన్ని ముఖాల రుద్రాక్షలు, ఇన్ని రకాల చెట్లు ఉంటాయని అసలు..
శివుడికి రుద్రాక్షకు ఉన్న సంబంధం గురించి భారతీయ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరమేశ్వరుడు, మహదేవుడు, నీలకంఠుడు ఇలా చాలా పేర్లతో శివుడిని పిలుచుకుంటారు. సాధారణ సమయాలలో ఎలా ఉన్నా కార్తీక మాసం, మాఘమాసంలో శివనామస్మరణ, శివారాధన మార్మోగుతుంది. మరీ ముఖ్యంగా మాఘమాసంలో చతుర్థశి రోజున వచ్చే శివరాత్రి అత్యంత మహిమాన్వితమైనది. ఈరోజు దేశం యావత్తు హరహరమహదేవ శంభో శంకరా.. అంటూ తన్మయత్వంలో మునిగిపోతుంది. అయితే రుద్రాక్ష ఎందుకంత శక్తివంతమైనది ఒక్క రుద్రాక్ష కోసం ఏడు కిలోమీటర్ల క్యూలో.. 9గంటలు నిలబడుకుని నిరీక్షిస్తున్నారు ప్రజలు. రుద్రాక్ష కోసం ఎందుకింత ఆరాటం? ఎక్కడ ఈ నిరీక్షణ తెలుసుకుంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రరాజధాని భోపాల్-సెహోర్ హైవేపై ప్రజలు బారుతీరి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్ళందరూ అక్కడ జరుగుతున్న రుద్రాక్ష ఉత్సవం కోసం వెళ్ళారు. మహాశివరాత్రి సంధర్బంగా కుంభేశ్వర్ ధామ్ లో పెద్ద ఎత్తున శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 70ఎకరాల ప్రాంగణంలో పలుచోట్ల భక్తులు తమ వాహనాలు పార్క్ చేయడానికి పార్కింగ్ ఏరియా ఏర్పాటుచేశారు. అయితే అవి ఏర్పాటుచేసిన కొంతసేపట్లోనే నిండిపోయాయి. దీంతో ఎంట్రీ నిలిపివేయాల్సి వచ్చింది. ఏడురోజుల పాటు శివపురాణ పఠనం జరుగుతోంది, భక్తులందరికీ రుద్రాక్షల వితరణ జరుగుతుంది. రుద్రాక్షలు తీసుకోవడానికే భక్తులు ఇంత మొత్తంలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ వితరణ చేస్తున్న ఒక్కరుద్రాక్ష కోసం ఎందుకింతగా ఎగబడుతున్నారంటే.. భక్తిపరంగా, ఆధ్యాత్మిక పరంగా రుద్రాక్ష ఎంతో శక్తివంతమైనది. రుద్రాక్ష ఎలా లభిస్తుంది? రుద్రాక్ష కథ ఏంటంటే..
Read also: Viral Photo: మీ కంటి చూపునకు ఓ పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న సంఖ్య ఎంతో చెప్పగలరా..?
రుద్రాక్ష అనేది రుద్రాక్ష చెట్టుకు కాసే పండు. 38రకాల రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఈ రుద్రాక్ష పండ్లు బ్లూబెర్రీ పండ్ల రంగులో కొన్ని, గోధుమ రంగులో మరికొన్ని ఉంటాయి. రుద్రాక్ష పండు తొక్క తీసిన తరువాత అందులో విత్తనమే రుద్రాక్ష. ఈ విత్తనాన్ని బాగా రుద్దినతరువాత రుద్రాక్ష అసలు రూపం కనిపిస్తుంది. ఒకటి నుండి 14ముఖాల వరకు రుద్రాక్షలు లభ్యమవుతాయి. శివుడి ఎడమకన్నులో రాలిన కన్నీటి బిందువుల నుండి 12రుద్రాక్ష వృక్షాలు, కుడి కన్ను కన్నీటి బిందువుల నుండి 16వృక్షాలు, మూడవ కన్ను నుండి నల్లని రంగులో 10 వృక్షాలు ఆవిర్భవించాయని చెబుతారు. వీటిలో ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపంగా చెబుతారు. మిగిలిన రుద్రాక్షలను ఆయా ముఖాలను బట్టి వాటి విశిష్టతలు వాటికున్నాయి. ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది. ఇది నేపాల్ ప్రాంతాల్లో దొరుకుతుందని చెబుతారు. ఇది మాత్రమే కాదు నేపాల్ ప్రాంతంలో రుద్రాక్ష చెట్లు విరివిగా పెరుగుతాయి. శివుడి కన్నీరు ఈ ప్రాంతంలో పడిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ నేపాల్ ప్రాంతాల్లో రుద్రాక్షలను 50రుపాయలకు విక్రయిస్తే అదే రుద్రాక్షలను పలుప్రాంతాల్లో దుకాణాలలో వేలరూపాయలకు విక్రయిస్తుంటారు. మొత్తానికి కుభేరేశ్వర్ ధామ్ లో ఉచితంగా రుద్రాక్ష తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వెళుతున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా ఈశా స్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు కూడా శివరాత్రి మహోత్సవం సందర్బంగా రుద్రాక్ష దీక్ష పేరుతో రుద్రాక్షలు వితరణ చేస్తారు. రుద్రాక్ష మానసిన, శారీరక సమస్యలను దూరం చేస్తుంది. అందుకే రుద్రాక్ష కోసం ఇంత ఆరాటం.