Viral Video: అయ్యో పాపం ఈ వధువు.. వరుడితో కలిసి డాన్స్ చేస్తోంటే.. ఇలా జరిగిందేంటి..?
ABN , First Publish Date - 2023-08-30T16:35:56+05:30 IST
వరుడు చేసిన చిన్న పొరపాటు ఆమెకు జీవితాంతం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.
పెళ్ళి అంటే కేవలం మూడు ముళ్ళు ఏడడుగులు మాత్రమే కాదు. ఎంతో సందడి ఉంటుంది. ఒకప్పుడు వంచిన తల ఎత్తకుండా తాళి కట్టించుకునే పెళ్లికూతురు ఇప్పుడు తనకు నచ్చినట్టు పెళ్లివేడుకను అనుభూతి చెందుతోంది. ఫంక్షన్ హాల్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం నుండి డీజే వరకు ఆడటంలో పాడటంలో ఎక్కడా తగ్గడం లేదు. ఓ వధువు తన పెళ్లి వేడుకలో వరుడితో కలసి డ్యాన్స్ వేస్తోంటే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వరుడు చేసిన చిన్న పొరపాటు ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఈ తరం వారు పెళ్లి(Marriage) విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. తమ తాహతుకు తగ్గట్టు అన్ని ముచ్చటలు తీర్చుకుంటున్నారు. పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరూ కలసి డ్యాన్స్ వేయడం కూడా ఇప్పట్లో సాధారణమైపోయింది. వీడియోలో ఓ వధువు(Bride) తన పెళ్ళిలో వరుడి(groom)తో కలసి డ్యాన్స్ వేస్తోంది. వరుడు వధువు చెయ్యి పట్టుకుని ఆమెను రౌండ్ గా తిప్పుతుండగా ఆమె బొంగరంలా అందంగా తిరుగుతోంది. ఇంతలోనే వరుడు ఆమెను తిప్పడం ఆపి తన చేతులతో ఆమెను పట్టుకుని కాస్త రొమాంటిక్ గా సినిమా స్టైల్ లో ఆమెను వంచి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతను తనను పట్టుకుంటాడని ఆమె అతనికి ఎదురుగా వెనుకవైపుకు ఒక కాలు మీద వంగింది. కానీ ఆమెను పట్టుకోవడంలో వరుడు విఫలం అయ్యాడు. అతను ఆమెను సరిగా పట్టుకోలేక చేతులు వదిలేశాడు. దీంతో పాపం ఆ వధువు వేదిక మీదే కింద పడిపోయింది. ఆమెను తన చేతుల నుండి జారవిడిచాక వరుడు కూడా సరిగా నిలబడలేక కాస్త తడబడటం చూడచ్చు. వేదిక కింద నుండి ఇదంతా చూసిన వారు అయ్యో అని కాస్త కంగారు వ్యక్తం చేసినా లోలోపల నవ్వుకున్నవారు చాలామందే ఉంటారని అందరూ అంటున్నారు.
Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా..? ఒకదాని బిల్లును మరో కార్డుతో చెల్లించడం మంచిదేనా..?
ఈ వీడియోను wedding.lehenga అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వధువు పడిపోగానే అయ్యో అంటూ తామే పడిపోయినట్టు ఫీలవుతున్నారు.'వరుడు జిమ్ చెయ్యలేదనుకుంటా అందుకే వధువును సరిగా పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'వధువును పడేశాడు. రాత్రికి అతని గతి ఏంటో ఏమో' అని మరొకరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. 'భయ్యా నువ్వు ఇంకా చాలా అనుభవించాల్సి ఉంది' అని మరొకరు వరుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతున్నారు.