ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: లవర్‌పై కోపంతో ఈ ప్రియురాలు ఏం చేసిందో చూడండి.. పాపం ఆ ప్రియుడు.. చూస్తే జాలేస్తుంది.. అసలు ఏం జరిగిందంటే..?

ABN, First Publish Date - 2023-08-07T15:23:06+05:30

పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది. పిచ్చి ముదిరింది అనే దానికి ఈ అమ్మాయే ప్రత్యక్ష ఉదాహరణ కావొచ్చు. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఓ అమ్మాయి ఏకంగా 80 అడుగులు ఎత్తైన హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కేసింది. దీంతో ఎక్కడ దూకుతుందోననే భయంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా ఆ హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కాల్సి వచ్చింది.

పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది. పిచ్చి ముదిరింది అనే దానికి ఈ అమ్మాయే ప్రత్యక్ష ఉదాహరణ కావొచ్చు. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఓ అమ్మాయి ఏకంగా 80 అడుగులు ఎత్తైన హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కేసింది. దీంతో ఎక్కడ దూకుతుందోననే భయంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా ఆ హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కాల్సి వచ్చింది. నా మాట వినవే, కాస్త దిగవే తల్లి అని బాయ్‌ఫ్రెండ్ ఎంత బతిమాలిడిన సదరు ప్రియురాలు అసలు వినలేదు. చివరకు పోలీసులు వచ్చినా ఆ అమ్మాయి దిగనని మొండికేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో ఓ ప్రేమ జంట ఉంది. అయితే ఏదో విషయంలో ఇరువురి మధ్య ఫోన్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నొచ్చుకున్న ప్రియురాలు.. ప్రియుడిపై కోపంతో దగ్గరలో ఉన్న 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది.


దీంతో వెంటనే 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కేసింది. ప్రియురాలు ఎక్కడ దూకేస్తుందేమోననే భయంతో ప్రియుడు కూడా ఆమెను అనుసరించాడు. ఆమెతోపాటే అతను కూడా టవర్ ఎక్కేశాడు. కిందికి దిగమని, ఎంత బతిమాలిడినా మాట వినకుండా మొండికేసింది. ఈ ఘటనను గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే పెండ్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. సదరు ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా సదరు అమ్మాయిని కిందికి దింపేందుకు ప్రయత్నించారు. పోలీసులు చెప్పినా దిగకుండా ఆ అమ్మాయి మొండికేసింది. చాలాసేపు ఆ అమ్మాయికి నచ్చజెప్పిన పోలీసులు ఏదో ఒక విధంగా కిందికి దిగేందుకు ఒప్పించారు. చివరకు ప్రేమికులిద్దరినీ పోలీసులు క్షేమంగా కిందికి దించారు.

ప్రస్తుతానికి ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కాకపోతే భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకర ప్రవర్తనకు పాల్పడవద్దని సదరు ప్రేమ జంటను కఠినంగా హెచ్చరించారు. అయితే ఈ ఘటన అంతటిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రేమ పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో పాపం ఆ ప్రియుడు.. చూస్తే జాలేస్తుందని రాసుకొస్తున్నారు.

Updated Date - 2023-08-07T15:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising