ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఇలాంటి కొడుకు పక్కన ఉంటే అమ్మను ఎవరూ ఏం చేయలేరు.. కన్న తల్లిని దొంగల నుంచి ఎలా రక్షించాడో చూడండి!

ABN, First Publish Date - 2023-08-13T18:37:31+05:30

తన తల్లిని కొడుకు దొంగల నుంచి రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తల్లి దగ్గర ఉన్న పర్సును లాక్కోవడానికి ఇద్దరు దొంగలు ప్రయత్నించగా వాళ్లను ఆమె కొడుకు తరిమికొట్టాడు.

తన తల్లిని కొడుకు దొంగల నుంచి రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తల్లి దగ్గర ఉన్న పర్సును లాక్కోవడానికి ఇద్దరు దొంగలు ప్రయత్నించగా వాళ్లను ఆమె కొడుకు తరిమికొట్టాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో(CCTV camera) ఈ ఘటన రికార్డైంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం తల్లి కొడుకులు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటికే ద్విచక్రవాహనంపై అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిల్చున్నారు. తల్లికొడుకులు రావడాన్ని వారు గమనించారు.


వారిద్దరిలో ఓ వ్యక్తి ఆ తల్లి చేతిలో ఉన్న పర్సును లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే ప్రతిఘటించిన ఆమె కొడుకు దొంగను అడ్డుకున్నాడు. దొంగపైన ఎదురుదాడి చేశాడు. అతన్ని తరిమికొట్టాడు. ఆ బాబుకు తల్లి కూడా సహకరించింది. దీంతో భయపడిన సదరు దొంగ ద్విచక్ర వాహనంపై ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వీక్షించిన నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లి కొడుకుల సమయస్పూర్తిని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి కొడుకు పక్కన ఉంటే అమ్మను ఎవరూ ఏం చేయాలేరని రాసుకొస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

Updated Date - 2023-08-13T18:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising