Viral Video: ఈ రిపోర్టర్ చెప్పే న్యూస్.. ఆ చిలుకకు కూడా నచ్చలేదేమో.. సైలెంట్‌గా వచ్చి ఇయర్ బడ్స్‌ను ఎత్తుకెళ్లిపోయిందిగా..!
ABN , First Publish Date - 2023-10-05T12:45:16+05:30 IST
చిలుకలకు మాటలు వస్తే మనిషికి ధీటుగా వాదించగలుగుతాయవి. అయితే ఈ చిలుక రూటు కాస్త సపరేటు. ఓ రిపోర్టర్ చాలా సీరియస్ గా న్యూస్ చెబుతోంటే మెల్లగా వచ్చి అది చేసిన పనికి..
మనిషి మాటలను అర్థం చేసుకుని వాటిని అనుకరించే జీవులలో చిలుకలు ముందు వరుసలో ఉంటాయి. చిలుకలకు మాటలు వస్తే మనిషికి ధీటుగా వాదించగలుగుతాయవి. అయితే ఈ చిలుక రూటు కాస్త సపరేటు. ఓ రిపోర్టర్ చాలా సీరియస్ గా న్యూస్ చెబుతోంటే మెల్లగా వచ్చి అతని భుజం మీద వాలి అతని చెవుల్లో ఉండే ఇయర్ బడ్స్ ఎత్తుకెళ్లిపోయింది. ఈ చిలుక చేసిన పనికి ఆ రిపోర్టర్ తో పాటు వీడియో చూసినవారు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఆ చిలుక డిమాండ్స్ ఏంటో ఏమో అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మనుషులకు దగ్గరగా మసిలే పక్షులు, జంతువులు కొన్ని ఉన్నాయి. వాటిలో చిలుకలది(parrots) ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే. వాటి చేష్టలు, వాటి మాటలు మనిషిని మించి తెలివిగా ఉంటాయి. వీడియోలో ఓ న్యూస్ రిపోర్టర్(Nwes reporter) చేతిలో మైక్ పట్టుకుని న్యూస్ రిపోర్ట్ చేస్తున్నాడు. అతనలా చెబుతుండగానే ఓ చిలుక వచ్చి అతని భుజం మీద వాలింది. కొన్ని క్షణాల పాటు అది అలా సైలెంట్ గా అతని భుజాలమీదే ఉండిపోయింది. చిలుక తన భుజం మీద వాలడం అతనికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. పైపెచ్చు వీడియో కూడా రికార్డ్ అవుతుండటంతో అతను న్యూస్ చెప్పడం ఏమాత్రం ఆపకుండా చెప్పుకుపోతున్నాడు. అప్పుడే ఉన్నట్టుండి ఆ చిలుక రిపోర్డర్ చెవిలో ఓ ఇయర్ బడ్(ear buds) ను బయటకు లాకి ముక్కున కరచుకుని ఎగిరిపోయింది. ఊహించని ఈ పరిణామానికి ఆ రిపోర్టర్ కూడా ఉలిక్కిపడ్డాడు. కానీ న్యూస్ మధ్యలో చెప్పడం ఆపలేక అతను బేల ముఖంతో అలాగే న్యూస్ చెప్పడం కొనసాగిస్తాడు.
Monkey Video: అరటికాయలు వేసేందుకు వెళ్తే.. అతడి కాళ్లకు అతుక్కుపోయిన కోతి.. ఎంతకూ వదలకపోవడంతో అతడేం చేశాడంటే..!
ఈ వీడియోను @buitengebieden అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. 'ఈమధ్యకాలంలో కోతులు మనుషుల వస్తువులు ఎత్తుకెళ్లి తినే పదార్థాలు ఏవైనా ఇస్తేనే వస్తువులను రిటర్న్ ఇస్తున్నాయి. ఈ చిలుకకు ఏం కావాలో ఏంటో?' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను చెబుతున్న న్యూస్ ఆ చిలుకకు నచ్చలేదేమో అందుకే అతన్ని ఇలా వేధిస్తోంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'మనుషులతో పాటు పక్షులు, జంతువులు కూడా బాగా అప్డేట్ అయ్యాయి' అని ఇంకొకరు అన్నారు.