ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎలుకను చంపాడని ఓ వ్యక్తి అరెస్ట్.. కానీ చివర్లో పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది!..

ABN, First Publish Date - 2023-07-25T21:00:51+05:30

ఎలుకను చంపాడని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన వ్యక్తి తన బైక్‌ను ఎలుక పైకి పదే పదే ఎక్కించి చంపిన వీడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నోయిడా: ఎలుకను చంపాడని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన వ్యక్తి తన బైక్‌ను ఎలుక పైకి పదే పదే ఎక్కించి చంపిన వీడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయితే చేశారు కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఎలుకపైకి పదే పదే ఎక్కించి దాన్ని చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు ఆ ఎలుక చనిపోయే వరకు వదలిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన మూగజీవాల ప్రేమికులు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఢిల్లీలోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఎలుకను చంపిన ఆ వ్యక్తి పేరు జైనులుద్దీన్. అతను నొయిడాలో ‘ఖాన్ బిర్యానీ’ సెంటర్ నడుపుతున్న మతాలుబ్ అహ్మద్ కుమారుడు. ఇక తాను ఎలుకను చంపిన వీడియో వైరల్ కావడంతో తనను పోలీసులు పట్టుకుంటారనే భయంతో జైనులుద్దీన్ పరారయ్యాడు. అతన్ని స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్‌లోని మూమురకు వెళ్లిపోయాడు. కానీ పోలీసులు మాత్రం జైనులుద్దీన్‌ను వదలిపెట్టలేదు. అతని స్వగ్రామానికి వెళ్లి మరి అరెస్ట్ చేశారు. సెక్షన్ 151 కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మూగజీవాల ప్రేమికులు నిందితుడికి తగిన శాస్తి జరిగిందని సంబురపడ్డారు.

కానీ ఇక్కడే పోలీసులు అసలు ట్విస్ట్ ఇచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. ఎలుకను చంపిన కేసులో జైనులుద్దీన్‌ను అరెస్ట్ చేయలేదని ప్రకటించారు. అతడిని మరొక కేసులో అరెస్ట్ చేసినట్టు వివరించారు. బిర్యానీ సెంటర్‌కు వచ్చిన కస్టమర్లతో డబ్బులు విషయమై జైనులుద్దీన్ గొడవ పడ్డాడని తెలిపారు. వివాదాన్ని పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తే తమ పైనే తిరగబడి తప్పించుకు తిరుగుతున్నట్టు చెప్పారు. అందుకే అతనిపై సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకానీ ఎలుకను చంపిన విషయమై అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-25T21:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising