ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: జపాన్ లోనూ జైలర్ ఫీవర్.. సాక్షాత్తూ జపాన్ అంబాసిడర్ రజనీ పాటకు కాలు కదిపితే ఇదిగో ఇలానే ఉంటుంది..

ABN, First Publish Date - 2023-08-20T15:10:02+05:30

భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ మధ్య విడుదలైన రజనీకాంత్ సినిమాలో కావాలా పాట ఎంత హిట్టైందో అందరికీ తెలిసిందే. డాన్స్ సరిగ్గా రానివారు కూడా ఈ పాటతో చెలరేగిపోతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ ఈ పాటతో రెచ్చిపోతున్నవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా జపాన్ అంబాసిడరే ఈ పాటకు కాలు కదపడం ఈ పాటకు, రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ ను స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 10వీడియోలలో సగానికిపైన కావాలా సాంగ్ రీల్స్ ఉంటాయి. తమన్నా, రజనీకాంత్ కాలు కదిపిన ఈ పాట చాలారోజుల తరువాత రజనీకాంత్ ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కావాలా పాట(Rajinikanth kavalaa song) ఫీవర్ పట్టుకుంది. వీడియోలో జపాన్ రాయభారి హిరోషి సుజుకీ(Japan Ambassador Hiroshi Suziki)), జపాన్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మాయో సాన్(Japan Youtuber Mayo san) తో కలిసి కావాలా పాటకు కాలు కదిపారు. ఈ వీడియోలో వీరిద్దరే కాక మరో రెండు జంటలు కూడా కాలు కదిపాయి. కాగా జపాన్ అంబాసిడర్ అయిన హిరోషి సుజుకి రజనీకాంత్ కు పెద్ద అభిమాని అంట(Rajinikanth fan). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తను కావాలా పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను తన పాత ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి 'నాకు రజనీకాంత్ మీద అభిమానం చెక్కు చెదరలేదు' అని చెప్పుకొచ్చారు. ఈ పాటలో హిరోషి సుజుకీ చాలా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ వేశారు. రజనీకాంత్ గాగుల్స్ ను స్టైల్ గా చేత్తో తిప్పి పెట్టుకోవడాన్ని కూడా దించేశాడు. ఇది చూసిన భారతీయులు, రజనీ అభిమానులు వీరి డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.

Viral Video: ఇంటిలోపల ఓ కుర్రాడి వింత నిర్వాకం.. బైక్ స్టంట్ చేయబోతే ఏం జరిగిందో మీరే చూడండి..



ఈ వీడియోను Hiroshi Suzuki, Ambassador of Japan తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. తనకు రజనీకాంత్ మీద ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదని క్యాప్షన్ మెన్షన్ చేశారు. 'మాయో శాన్ డ్యాన్ ద్వారా మ్యాజిక్ చేస్తుంది. హిరోషి సుకిజి ఆమెతో కలసి రజనీకాంత్ పాటకు డ్యాన్స్ వేయడం చాలాబాగుంది. దేశాలతో సంబంధం లేకుండా రజనీకాంత్ ను అభిమానిస్తున్నారు' అని ఒకరు కామెంట్ చేశారు. 'తొందరలోనే ఈ సినిమా జపాన్ లో విడుదలై అక్కడి అభిమానులను సంతోషపెట్టాలి' అని మరొరకరు కామెంట్ చేశారు. కాగా గతంలో కూడా హిరోషి సుజికీ తలైవార్ ఛాలెంజ్ ను స్వీకరించిన విషయం తెలిసిందే.

Viral Video: ఈ సైకిల్ ఓనర్ ట్యాలెంట్ మాములుగా లేదుగా.. కారుకు ధీటుగా ఇతను క్రియేట్ చేసిందేంటో చూస్తే అవాక్కవడం ఖాయం..


Updated Date - 2023-08-20T15:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising