ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమికుడితో కలిసి తల్లి వద్దకు వెళ్లి హల్‌చల్ చేసిన కూతురు.. కారణం తెలుసుకుని చివరకు స్థానికులు ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2023-03-14T19:11:18+05:30

అనుకోని విధంగా ఏర్పడే పరిచయాలు.. కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. కొన్ని స్నేహంగా మారితే.. మరికొన్ని పరిచయాలు చివరకు ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. ఇటీవల బీహార్‌లో ఓ యువతి విషయంలోనూ ఇలాగే జరిగింది. రాంగ్ నంబర్ ద్వారా పరిచయమైన యువకుడిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనుకోని విధంగా ఏర్పడే పరిచయాలు.. కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. కొన్ని స్నేహంగా మారితే.. మరికొన్ని పరిచయాలు చివరకు ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. ఇటీవల బీహార్‌లో ఓ యువతి విషయంలోనూ ఇలాగే జరిగింది. రాంగ్ నంబర్ ద్వారా పరిచయమైన యువకుడిని ప్రేమించిన యువతి.. చివరకు తల్లిదండ్రులను ఎదరించి మరీ పెళ్లి చేసుకుంది. ఇటీవల ఓ రోజు ప్రియుడిని తీసుకుని తల్లి వద్దకు వెళ్లి హల్‌చల్ చేసింది. చివరకు స్థానికులు కలుగజేసుకోవడంతో సమస్య సర్దుమణిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందటే..

బీహార్ (Bihar) అర్రాలో నగరంలోని ఆనంద్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రజనీ కుమారి అనే 18 ఏళ్ల యువతి (young woman).. తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇలావుండగా, ఈమె ఫోన్‌కు ఇటీవల ఓ రాంగ్ నంబర్ (Wrong number) నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను పాట్నా జిల్లా షాలింపూర్ అహ్రా గ్రామానికి చెందిన రాజేంద్రగా పరిచయం చేసుకున్నాడు. పరిచయం అనంతరం తరచూ ఆమెకు రజనీ కుమారికి ఫోన్లు చేస్తూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్లకు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. క్రమంగా వీరి మధ్య ప్రేమ (love) మొదలైంది.

పరిపక్వత లేదంటూ బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న యువతి.. చివరకు ఆమె చేసుకున్న వ్యక్తిని చూసి అంతా షాక్..

అప్పటి నుంచి అప్పుడప్పుడూ రజనీకుమారిని కలుస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని రజనీకమారి.. తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు అంగీకరించలేదు. అయినా రజనీ కుమారి మాత్రం అతడితో మాట్లాడుతూ ఉండేది. ఇటీవల ఓ రోజు ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. తర్వాత పాట్నాలో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అప్పటి నుంచి రజనీ కుమారి కూడా తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండేది. అయితే ఇటీవల ఆమెకు ఆధార్ కార్డు (Aadhaar card) అవసరం పడింది.

Viral Video: ప్రియురాలిని పార్క్‌కు పిలిచి.. వద్దు వద్దు అంటున్నా.. నుదుటిన బొట్టు పెట్టి మరీ.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

ఆధాక్ కార్డు పుట్టింట్లో ఉండడంతో తీసుకురావడానికి భర్తను తీసుకుని వెళ్లింది. ఆస్పత్రి వద్ద ఉన్న తల్లి వద్దకు వెళ్లి ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తల్లి అని కూడా చూడకుండా ప్రియుడితో కలిసి దాడికి (Assault on mother) పాల్పడింది. స్థానికులు కలుగజేసుకుని వారిని విడిపించారు. తల్లీకూతుళ్లకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మందు కొట్టి స్నేహితుడి ఇంటికి వెళ్లిన యువకుడు.. సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా.. ‘‘నీ భార్యను నా వద్దకు పంపించు’’.. అని అడగడంతో..

Updated Date - 2023-03-14T19:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising