ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైలు ఎక్కుతుండగా.. పిల్లలతో సహా కిందపడిన మహిళ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

ABN, Publish Date - Dec 24 , 2023 | 06:11 PM

రైలు ప్రయాణ సమయాల్లో కంగారుతో కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అదృష్టం బాగుండి.. కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఈ తరహా...

రైలు ప్రయాణ సమయాల్లో కంగారుతో కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అదృష్టం బాగుండి.. కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, బీహార్‌లో చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ తన పిల్లలతో సహా ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని (Bihar) బార్హ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోట చేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు బెగుసరాయ్ నుంచి బార్హ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. విక్రమశిలా ఎక్స్‌ప్రెస్ రైలు కోసం అప్పటికే ప్రయాణికులు అధిక సంఖ్యలో వేచి చూస్తూ ఉన్నారు. రైలు రాగానే అంతా ఒక్కసారిగా తోసుకుంటూ రైలు ఎక్కడం మొదలెట్టారు. వారితో పాటూ మహిళ భర్త రైలు ఎక్కేశాడు. అతడి వెనుకే ఉన్న భార్య కూడా తన పిల్లలను ఎత్తుకుని రైలు ఎక్కబోయింది. అయితే రైలు ఎక్కే సమయంలో (woman fell in the middle of train to platform) ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి పిల్లలతో సహా ఉన్నట్టుండి ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయింది.

Viral Video: పెళ్లి పీటలపై మామ మనుసు గెలుచుకున్న అల్లుడు.. ఇంతకీ ఇతడు చేసిన పనేంటంటే..

భార్య కిందపడిపోవడం చూసి భర్త కూడా వెంటనే రైలు దిగేశాడు. అతడితో పాటూ అక్కడున్న వారంతా ఆమె పడిపోవడం చూసి కంగారుపడ్డారు. అయితే ఆమెను పైకి లేపే.. గార్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రైలు ముందుకు కదిలింది. అయినా మహిళ భయపడకుండా.. ముందుగా తన పిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారిని గట్టిగా పట్టుకుని పట్టాల పక్కనే పడుకుంది. రైలు దాటిపోయిన తర్వాత అంతా వెళ్లి చూడగా వారికి ఏమీ కాలేదు. పిల్లలతో పాటూ ఆమెకూ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించగా.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: పెళ్లి పీటలపై వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు.. చివరకు ఎవరికీ తెలీకుండా ఎలా మ్యానేజ్ చేశాడో చూడండి..

Updated Date - Dec 24 , 2023 | 06:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising