అనారోగ్యంతో భర్త చనిపోయాడని ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. ఏ రోగం లేకపోయినా ఎలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!
ABN, First Publish Date - 2023-02-16T13:30:58+05:30
ఆవిడగారి జిమ్మిక్కులను కనిపెట్టిన కొంత మంది పోలీసులకు తెలియజేయడంతో..
కుటుంబమంటే భార్యాభర్తలు.. పిల్లలు. ఏ కుటుంబమైనా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని పెద్దలు కోరుకుంటారు. అలా కాకుండా గొడవలు, కొట్టుకోవడాలు, అరుచుకుకోవడాలు ఉంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఆ ఎఫెక్ట్ పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందుకోసమే పెళ్లి చేసేటప్పుడు ఆచూతూచి సంబంధాలు వెతికి తల్లిదండ్రులు వివాహం చేస్తుంటారు. కానీ పెళ్లాయ్యాక దంపతులిద్దరూ సరైన విధానంలో నడుచుకోకపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది.
ఆకర్షణ.. కోరికలు.. ప్రతీ మనిషికి సహజం. వాటిని నియంత్రించుకునే శక్తి కూడా ప్రతి మనిషికి ఉంటుంది. అలా కాకుండా అవి కార్యరూపం దాలిస్తే మాత్రం విపరీత అనార్థాలకు దారి తీస్తోంది. ఒక్కోసారి ఆకర్షణ మనసును అయస్కాంతాలా పట్టి లాగేస్తోంది. అలాంటి సమయాల్లో కంట్రోల్ ఉంచుకోకపోతే జరగరాని నష్టం జరిగితే చేసేదేమీ ఉండదు. ఉన్నదాన్నితో సంతృప్తి చెందాలి లేకపోతే ఉన్నదికూడా పోతుంది అని పెద్దలంటారు. ఇవి అక్షర సత్యాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడమేనేగా మీ అనుమానం. అయితే, మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: తప్పు వరుడిదే.. సారీ చెబుతామన్నా వినని వధువు.. నాకీ పెళ్లి వద్దంటూ తేల్చేసింది.. అసలేం జరిగిందంటే..
చాలా మంది జీవితాల్లో పెళ్లి (Wedding)కి ముందు.. పెళ్లికి తర్వాత అని చెప్పుకుంటారు. వివాహం (Marriage) అయ్యాక గతాన్ని మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అలా కాకుండా పెడదారి పడితే జైలు (Prison) ఊచలు లెక్కట్టాల్సి వస్తోంది.
ఎంతో అందమైన ఫ్యామిలీ (Family). భార్యాభర్తలు. ఇద్దరు పిల్లలు. చీకూ చింత లేని జీవితం. కానీ, అక్రమం సంబంధం ఆ బంగారు కుటుంబంలో చిచ్చు రేపింది. క్షణిక సుఖం కోసం అప్పటివరకు ఎంతో ప్రేమ (love)ను పంచిన బంధాన్ని చిదిమేసేందుకు సిద్ధమైంది. అంతే.. మనిషిలోని మృగం తట్టిలేపింది. దారుణమైన కుట్రకు తెరలేపారు. సీన్ కట్ చేస్తే.. కటకటాల్లో జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?
కర్ణాటక (Karnataka) లోని మైసూర్ (Mysore) బోగాది ప్రాంతానికి చెందిన లిఖితతో 12 ఏళ్ల క్రితం మంజుకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇంతలో ఏం పాడుబుద్ధి పుట్టిందో ఏమో తెలియదు గానీ.. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలోనే లిఖిత.. ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్దలు ఆమెకు నచ్చచెప్పి తిరిగి భర్తకు అప్పగించారు. కానీ ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో తరుచూ భర్త (husband) ప్రశ్నించడంతో గొడవలు మరింత ముదిరాయి. అంతే ఆమెలో ఉన్న రాక్షసత్వం తట్టి లేచింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని లిఖిత కక్ష కట్టింది. ఎలాగైనా ప్రియుడితో కలిసి చంపేయాలని హత్యకు స్కెచ్ వేసింది. అంతే మంగళవారం రాత్రి భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి గొంతు పిసికి చంపేసింది. బుధవారం ఉదయం ఏమీ ఎరగనట్టు నంగనాచిలా భర్త అనారోగ్యంతో చనిపోయాడంటూ శోకాలు పెట్టింది. అయ్యో పాపం అంటూ ఇరుగుపొరుగు వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆవిడగారి జిమ్మిక్కులను కనిపెట్టిన కొంత మంది పోలీసులకు తెలియజేయడంతో.. ఖాకీలు తమదైన శైలిలో విచారిస్తే.. అసలు విషయం వెలుగుచూసింది. ఏ రోగం లేకపోయినా ఎలా చనిపోయాడంటూ ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్ (shocking twist) బయటపడింది. దీంతో నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకుని రిమాండ్ (Remand)కు తరలించారు. ఆమె నిర్వాకంతో అందమైన కుటుంబం పాడవ్వడమే కాకుండా పిల్లలు అనాథులుగా మిగిలారు.
Updated Date - 2023-02-16T14:01:54+05:30 IST