Viral Video: ఇదేదో వింత జంతువు అనుకుంటే పొరపాటే.. వేలి సైజులో ఉన్న దీని గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, First Publish Date - 2023-10-08T16:47:37+05:30
ప్రపంచంలోనే అత్యంత పొడవైన, పొట్టిగా ఉన్న వారిని చూశాం. అలాగే జంతువుల్లోనూ అత్యంత పెద్దది, అత్యంత చిన్న వాటిని చాలా చూశాం. ఇలాంటి విచిత్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన, పొట్టిగా ఉన్న వారిని చూశాం. అలాగే జంతువుల్లోనూ అత్యంత పెద్దది, అత్యంత చిన్న వాటిని చాలా చూశాం. ఇలాంటి విచిత్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అత్యంత చిన్న సైజులో ఉండే కోతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కేవలం వేలిపై కూర్చునేంత పరిమాణంలో ఉన్న ఈ కోతిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ కోతికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో చిన్న సైజులో ఉన్న కోతి (Monkey viral video) వీడియో తెగ వైరల్ అవుతోంది. చేతి వేలును గట్టిగా పట్టుకున్న కోతి.. భయం భయంగా చూస్తోంది. దీన్ని చూస్తే పైకి ఏదో వింత జంతువులా కనపిస్తోంది. అయితే ఇంత చిన్న పరిమాణంలో ఉన్న ఈ జంతువు కోతి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యకం కలగకమానదు. దక్షిణ అమెరికాలోని (South America) అమెజాన్ అడవుల్లో ఈ కోతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కోతులు కేవలం 100 గ్రాముల బరువు, 5నుంచి 6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత చిన్న (smallest monkey in the world) కోతులైన వీటిని ఆ ప్రాంతాల్లో పిగ్మీ మార్మోసెట్స్, ఫింగర్ కోతులు అని పిలుస్తుంటారు.
ఈ కోతులు సాధారణంగా 15నుంచి 20 ఏళ్ల వరకు జీవిస్తాయట. చెట్ల నుంచి వచ్చే చిగురు, పండ్లు, సీతాకోక చిలుకలు, బల్లులు తదితర కీటకాలను తింటూ తమ కడుపు నింపుకొంటుంటాయి. ప్రస్తుతం ఈ జాతి కోతులు అంతరించిపోయే దశలో ఉన్నాయట. కాగా, ఈ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇలాంటి బుల్లి కోతులు మొదటిసారి చూస్తున్నాం’’.. అని కొందరు, ‘‘అరె! ఇలాంటి కోతులు కూడా ఉంటాయా’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో 6మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.
Updated Date - 2023-10-08T16:47:37+05:30 IST