Yellow Teeth: ఎంత ప్రయత్నించినా పచ్చగా ఉన్న పళ్లు తెల్లగా మారడం లేదా..? ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పేస్ట్‌ను వాడితే..!
ABN , First Publish Date - 2023-07-03T12:05:24+05:30 IST
ఇంట్లో తయారు చేసుకునే ఈ పేస్ట్ ను ఉపయోగించడం వల్ల పసుపు, ఎరుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మిలమిలా మెరుస్తాయి..
మాట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, తింటున్నప్పుడు ఇలా చాలా సందర్భాలలో పళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెల్లగా చక్కని పలువరుసతో ఉన్నవారు ఏదైనా మాట్లాడటంలో సందిగ్థం లేకుండా చెప్పగలుగుతుంటారు. పైకి చెప్పరు కానీ దంతాలు రంగు మారి ఎరుపు, పసుపు రంగులో ఉంటే వారు దంత సంరక్షణ సరిగ్గా తీసుకోవట్లేదని, శుభ్రత ఫాలో అవ్వడం లేదని ఇతరులు భావిస్తుంటారు. కానీ ధూమపానం, కాఫీ, టీ లు అధికంగా తాగడం, ఎక్కువకాలం మందులు ఉపయోగించడం వంటి కారణాల వల్ల దంతాలు పసువు, ఎరుపు రంగులోకి మారతాయి. దీన్ని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాల నుండి, మార్కెట్లో లభ్యమయ్యే ఎన్నోరకాల పేస్ట్ లు వాడుతుంటారు. కానీ తగిన ఫలితం ఉండదు. అలాంటి వారు ఇంట్లో తయారు చేసుకుని ఈ పేస్ట్ ను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇంతకీ ఆ పేస్ట్ ఏంటి? దాన్ని ఎలా తయారుచేసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..
రంగు మారిన పళ్ళను తిరిగి తెలుపురంగులోకి మార్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు చెయ్యక్కర్లేదు. వంట గదిలో లభించే మూడే మూడు పదార్థాలతో పేస్ట్ తయారుచేసుకోవచ్చు(home made teeth whitening paste). దీనికి కావలసిందల్లా నిమ్మకాయ(lemon), ఉప్పు(salt), ఆవాల నూనె(mustard oil). ఒక టేబుల్ స్పూన్ ఉప్పులో కొద్దిగా నిమ్మరసం పిండాలి, ఇందులోకి కొద్దిగా ఆవాల నూనె కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు. దీంతో వారంలో మూడు సార్లు బ్రష్ చేసుకుంటూ ఉంటే పళ్ళమీద గార, పాచి, ఎరుపురంగు అంతా మెల్లిగా తగ్గిపోతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దంతాలపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఇది మాత్రమే కాకుండా దంతాలు తెలుపు రంగులోకి మారడానికి మరిన్ని సులువైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
Viral Video: నిజమైన హీరో నువ్వేనయ్యా.. ఆవు పీక పట్టుకుని చంపుతున్న సింహాన్ని ఒంటిచేత్తో ఉరికించాడు..
సాధారణంగా రోజూ పళ్లు తోమడానికి ఉపయోగించే పేస్ట్ లో కాసింత బేకింగ్ సోడా(baking soda with paste) కలిపి పళ్లు తోముతున్నా ఫలితం ఉంటుంది. ఇది వారానికి 2నుండి 3సార్లు ఉపయోగించాలి.
ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు తాజా నారింజ తొక్కలను పళ్ళమీద రుద్దుతూ(rub with orange peels) ఉంటే పళ్ళమీద ఎరుపు, పసుపు పోవడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.
కొబ్బరినూనె(coconut oil) దంతాల సంరక్షణకు మంచి ఔషదం. ప్రతి రోజూ ఉదయం టేబుల్ స్పూన్ మోతాదు కొబ్బరినూనే నోట్లో వేసుకుని సుమారు 10నిమిషాల సేపు ఆయిల్ పుల్లింగ్(oil pulling with coconut oil) చేస్తుంటే పళ్ళ సందుల్లో ఉన్న ఎరుపు, పసుపు రంగు, మురికి వంటివి కూడా తొలగిపోతాయి.