Viral News: అమ్మ బాబోయ్.. రూ.1.60 కోట్లను నడిరోడ్డుపై విసిరేశాడు.. కట్టలకొద్దీ డబ్బును బ్యాగుల్లో పెట్టుకుని వచ్చి మరీ..!
ABN, First Publish Date - 2023-04-18T16:55:52+05:30
ఎవరైనా ధానధర్మాలు ఎందుకు చేస్తుంటారు పుణ్యం కోసం. అది కూడా తమకు కలిగిన దాంట్లో కొంత సాయం చేస్తుంటారు. అంతేగానీ తమకున్నదంతా ఇచ్చేయరు. కానీ ఓ వ్యక్తి.. ఏకంగా బ్యాంక్ అకౌంట్ల ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి విసిరేశాడు. ఎక్కడా? ఏంటో తెలియాలంటే
ఎవరైనా ధానధర్మాలు ఎందుకు చేస్తుంటారు పుణ్యం కోసం. అది కూడా తమకు కలిగిన దాంట్లో కొంత సాయం చేస్తుంటారు. అంతేగానీ తమకున్నదంతా ఇచ్చేయరు. కానీ ఓ వ్యక్తి.. ఏకంగా బ్యాంక్ అకౌంట్ల ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి విసిరేశాడు. ఎక్కడా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన హర్షసాయి అనే యువకుడు గుర్తున్నాడా? ఇతడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇతడు వేలకు వేలు.. లక్షలకు లక్షల నగదును పేదలకు ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. ఇలానే చేయాలనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. అమెరికాలో కూడా ఓ యువకుడు కోట్లలో నగదు తీసుకొచ్చి రోడ్డుపై వెదజల్లేసి వెళ్లిపోయాడు. ఈ వార్త పెద్ద సంచలనమైంది. ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసిన ఈ షాకింగ్ సంఘటన అమెరికా (America)లోని ఒరెగాన్ రాష్ట్రం (Oregon man)లో చోటుచేసుకుంది.
కొలిన్ డేవిస్ మెక్‌కార్తీ (38) అనే యువకుడు (Colin Davis McCarthy) బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్లు తీసుకొచ్చి అమెరికాలో రద్దీగా ఉండే హైవేపై విసిరేశాడు. బహుమతిగా ఇస్తూ ఇతరులను ఆశీర్వదిస్తున్నానని చెబుతూ కారు కిటికీలోంచి 2 లక్షల డాలర్లు (car window) వెదజల్లాడు. భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.1.6 కోట్లు. ఒరెగాన్‌లో కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల్లాగా విసిరేస్తుంటే వాటిని చూసి వాహనదారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంత మంది తమ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేసి నోట్లను ఏరుకోవడం మొదలు పెట్టారు.
ఏప్రిల్ 11న రాత్రి 7.20 గంటల ప్రాంతంలో డబ్బు విసిరినట్లు ఒరెగాన్ స్టేట్ పోలీసులు తెలిపారు. మొత్తం సుమారు 2 లక్షల డాలర్ల విలువైన కరెన్సీ నోట్లను రహదారిపై విసిరేసినట్లు చెప్పుకొచ్చారు. రాత్రిపూట సరిగా కనిపించలేకపోవడంతో కొందరు వాహనాల ఫ్లాష్‌లైట్లను ఆన్ చేసుకొని మరీ నోట్ల కోసం వెతుక్కున్నారు. హైవేపై రెండు వైపులా వాహనాల డ్రైవర్లు డబ్బుల కోసం ఉరుకుల పరుగులు తీశారు.
కరెన్సీ నోట్లు రోడ్డుపై చిందరవందరగా కనిపించాయని స్థానిక మహిళ మీడియాకు తెలిపింది. ఆ దృశ్యం చూసి మొదట నమ్మలేకపోయానని చెప్పింది. ఆ తర్వాత వాటిని సొంత చేసుకునేందుకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెతికినట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరం చెరో వైపు వెతకడంతో 300 డాలర్లు దొరికినట్లు ఆమె వివరించింది. ఇదిలా ఉంటే కొలిన్ నోట్లను హైవేపై విసిరేయడంతో అతడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తమ జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను మొత్తం ఖాళీ చేశాడని వాపోయారు. తమకు ఒక్క డాలర్ కూడా మిగల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అది షేర్డ్ అకౌంట్ కావడంతో పోలీసులు కూడా కొలిన్‌ను ఏమీ చేయలేకపోయారు. అతడిపై ఎలాంటి నేరం మోపలేదు. అతను తన దగ్గర బాగా డబ్బు ఉందని, ఇతరుల జీవితాలను బాగు చేసేందుకే డబ్బును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో కొలిన్ తప్పు చేసినట్లు కనిపించకపోవడంతో పోలీసులు కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Crime News: బీచ్‌లో షాకింగ్ సీన్.. ఇసుకలోంచి బయటపడిన ఓ పాప కాలు.. చివరకు తేలిన నిజం ఏంటంటే..!
Updated Date - 2023-04-18T17:01:54+05:30 IST