ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌తో కాబోయే భార్యను చంపేందుకు పక్కా స్కెచ్.. అన్నంత పనీ చేశాడు కానీ..!

ABN, First Publish Date - 2023-08-29T21:48:55+05:30

ప్రేమికులంతా వారి ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కొందరు తమ తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోతుంటారు. మరికొందరు ఇష్టపడిన వారితో సహజీవనం చేయడం, అనంతరం వివాహాలు చేసుకోవడం చేస్తుంటారు. అయితే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికులంతా వారి ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కొందరు తమ తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోతుంటారు. మరికొందరు ఇష్టపడిన వారితో సహజీవనం చేయడం, అనంతరం వివాహాలు చేసుకోవడం చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని విధంగా విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. కాబోయే భార్యతో సహజీవనం చేశాడు. పెళ్లికి అంతా ఓకే చెప్పినా అతను మాత్రం అన్నంత పనీ చేశాడు. ప్రెజర్ కుక్కర్‌తో కాబోయే భార్యను చంపేందుకు పక్కా స్కెచ్ వేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

కేరళలోని (Kerala) కోవలంకు చెందిన వైష్ణవ్ కేరళలోని కళాశాలలో చదువుకునే రోజుల్లో తిరువనంతపురానికి చెందిన యువతి పరిచయమైంది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ఇద్దరూ త్వరగా దగ్గరయ్యారు. చదువు అనంతరం వారికి మార్కెంటింగ్‌కు సంబంధించి బెంగళూరులోని (Bangalore) వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు కూడా వచ్చాయి. అప్పటికే ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకే ఇల్లు అద్దెకు తీసుకుని మూడేళ్ల పాటు సహజీవనం (Live in relationship) చేశారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రెండు కుటుబాల వారూ పెళ్లికి ఓకే చెప్పారు. ఇక వివాహమే తరువాయి.. అని అనుకుంటున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

Wife: భార్య నల్లగా ఉందంటూ కరెంట్ షాకిచ్చి చంపేసిన భర్త.. ఐస్ బాక్సులో పెట్టి తప్పించుకునేందుకు స్కెచ్.. ఎలా దొరికిపోయాడంటే..!

తనకు కాబోయే భార్య.. వేరే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని వైష్ణవ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరికీ రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరూ ఇదే విషయమై గొడవపడ్డారు. సాయంత్రం 5గంటల సమయంలో మళ్లీ గొడవపడ్డారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంలో ఉన్న వైష్ణవ్.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వంటగదిలోని ప్రెజర్ కుక్కర్‌తో (attacked with pressure cooker) ప్రియురాలిని చితకబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అనుమానంతోనే హత్య చేశారనని వైష్ణవ్ అంగీకరించడంతో.. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman: 3 వారాలుగా ఓ మహిళకు జ్వరం.. ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లకు షాక్.. ఏం చేయాలో తెలియక శాస్త్రవేత్తల వద్దకు వెళ్తే..!

Updated Date - 2023-08-29T21:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising