ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: సినిమా సన్నివేశాన్ని తలపించే రియల్ మ్యారేజ్.. ప్రియురాలి మెడలో తాళి కడుతుండగా.. యువతి తండ్రి ఎంట్రీ.. చివరకు..

ABN, First Publish Date - 2023-09-17T16:03:55+05:30

ప్రేమికుల ప్రవర్తన చూస్తే కొన్నిసార్లు అచ్చం సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కనిపెంచిన వారిని సైతం లెక్కచేయకుండా, ఇంటి నుంచి వెళ్లిపోయేవారు కొందరైతే.. మరికొందరు కుటుంబ సభ్యుల ఎదుటే సినిమాల్లో మాదిరి పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఇలాంటి...

ప్రేమికుల ప్రవర్తన చూస్తే కొన్నిసార్లు అచ్చం సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కనిపెంచిన వారిని సైతం లెక్కచేయకుండా, ఇంటి నుంచి వెళ్లిపోయేవారు కొందరైతే.. మరికొందరు కుటుంబ సభ్యుల ఎదుటే సినిమాల్లో మాదిరి పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమికులు పెళ్లి చేసుకున్న విధానం చూసిన నెటిజన్లు.. ‘‘సినిమా సన్నివేశాన్ని తలపించే రియల్ మ్యారేజ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ ఔరయ్యా జిల్లాలోని (Uttar Pradesh Auraiya district) దిబియాపూర్ పట్టణ పరిధి సంజయ్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన నితిన్ అనే యువకుడు, షబ్నం యాదవ్ అనే యువతికి (young woman) రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా పెళ్లి (love marriage) చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఈ విషయాన్ని ఇటీవల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే వారి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి అంగీకరించలేదు. తాము చెప్పిన యువకుడినే వివాహం చేసుకోవాలని కండీషన్ పెట్టాడు. అయినా ప్రేమికులు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

Viral Video: ఇలాంటి కారును ఇండియాలో మాత్రమే చూడగలం.. ఇంతకీ ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవడం ఖాయం..

ఇటీవల ఓ రోజు ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు సమీపంలోని ఆలయానికి చేరుకున్నారు. తన కూతురు రహస్యంగా పెళ్లి చేసుకుంటోదన్న సమచారం అందుకున్న సెక్యూరిటీగా పని చేస్తున్న తండ్రి.. అటు నుంచి అటే నేరుగా అక్కడికి చేరుకున్నాడు. తన కూతురిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఎంతో ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. తండ్రి బలవంతపెడుతున్నా వినిపించుకోకుండా అందరి ఎదుటే ప్రియుడితో తాళి కట్టించుకుంది. దీంతో చేసేదిలేక యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కూడా ప్రేమికుల వైపే నిలిచారు. కాగా, ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలగా స్పందిస్తున్నారు.

Viral Video: తెలిసి చేసిందా... తెలీక చేసిందా... బైకుపై కూర్చున్న ఈ మహిళను చూసి నవ్వుకుంటున్న నెటిజనం..

Updated Date - 2023-09-17T16:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising