Shocking Video: నేను పిచ్చిదాన్నే.. చస్తానంటూ కేకలు పెడుతూ.. కిందకు దూకేసిన యువతి.. కాపాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తే..!
ABN, First Publish Date - 2023-10-06T19:40:58+05:30
కొందరు యువతులు చిన్న చిన్న సమస్యలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. తేలిగ్గా తీసుకోవాల్సిన విషయాలపై కూడా ఎంతో సీరియస్‌గా ఆలోచిస్తూ చివరకు ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. టీచర్లు, తల్లిదండ్రులు తిట్టారంటూ కొందరు..
కొందరు యువతులు చిన్న చిన్న సమస్యలకే తీవ్రంగా కుంగిపోతుంటారు. తేలిగ్గా తీసుకోవాల్సిన విషయాలపై కూడా ఎంతో సీరియస్‌గా ఆలోచిస్తూ చివరకు ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. టీచర్లు, తల్లిదండ్రులు తిట్టారంటూ కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు, ప్రేమలో విఫలమయ్యామని ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బిల్డింగ్ అంచున కూర్చున్న యువతి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. దూకొద్దంటూ కింద నుంచి ఓ కుర్రాడు కేకలు వేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
బీహార్ రాజధాని పాట్నాలో (Bihar capital Patna) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బుద్ధా కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి జై రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ (Apartment) వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకున్న హృదయవిదారక ఘటనతో అంతా షాక్ అయ్యారు. 12వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. అపార్ట్‌మెంట్ నాగులో అంతస్తు పైకి ఎక్కి చివరన కూర్చుంది. కాసేపటికి ఆమెను గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేసి హెచ్చరించారు. ‘‘నేను చనిపోతున్నాను’’.. అని బాలిక అరవడంతో కింద ఉన్న వారు ‘‘నీకేమైనా పిచ్చా.. అలా చేయకు.. మేము వస్తున్నాం.. కిందకు వచ్చేయండి’’.. అని అన్నారు. దీంతో సదరు బాలిక ‘‘అవును.. నేను పిచ్చిదాన్నే.. అందుకే చనిపోవాలని అనుకుంటున్నా’’.. అని సమాధానం ఇచ్చిన కాసేపటికి అందరికీ (girl committed suicide) షాక్ ఇస్తూ ఒక్కసారిగా కిందకు దూకేసింది.
Crime: మూడో అంతస్థులో బంగారం షాపు.. అడుగడుగునా 16 సీసీ కెమెరాలు.. అయినా ఎలా చోరీ చేయగలిగారంటే..!
అదే సమయంలో కింద ఉన్న ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. బాలిక కింద పడిన వెంటనే తల నేలకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను.. చుట్టు పక్కల వారు చికిత్సం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతురాలు నాగేశ్వర్‌కాలనీలో తన కుటుంబంతో కలిసి ఉంటోదని తెలిసింది. 12 తరగతి పరీక్షల్లో మార్కులు సక్రమంగా రాకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు విచారణలో తెలిసింది. ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకుందా.. లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-06T19:40:58+05:30 IST