ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఏం తెలివిరా బాబూ.. ప్రేయసి మైనర్.. పెళ్లయ్యాక ఇబ్బందులు రాకూడదని 23 ఏళ్ల కుర్రాడి వింత నిర్వాకం.. పెళ్లికి ముందే..!

ABN, First Publish Date - 2023-04-14T14:43:48+05:30

ప్రేమ గుడ్డిదంటారు. అలా ఎందుకంటారో తెలియదు గానీ.. ఓ ప్రేమికుడు వింత నిర్వాకం తెలిస్తే వీడు మహా ముదుర్రా అనకుండా ఉండలేరు. అసలు ఇంతకీ ఏమైంది? ఆ ప్రేమికుడి చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే

Viral News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రేమ గుడ్డిదంటారు. అలా ఎందుకంటారో తెలియదు గానీ.. ఓ ప్రేమికుడు వింత నిర్వాకం తెలిస్తే వీడు మహా ముదుర్రా అనకుండా ఉండలేరు. అసలు ఇంతకీ ఏమైంది? ఆ ప్రేమికుడి చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

తెలిసీతెలియని వయసులో అబ్బాయి.. అమ్మాయిలు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. వింటుంటాం. ఆ మైకంలో ఉన్న వారు చేస్తారో వారికే తెలియదు. అంతలా ప్రేమలో మునిగిపోతుంటారు. పెద్దోళ్లు ఏం చెప్పినా చెవులకు ఎక్కవు. అంతగా వాళ్లు ఆ మైకంలో మునిగి తేలుతుంటారు.

ఆ అబ్బాయి వయసు 23. ప్రేమికురాలేమో చిన్నది. ఇంకా మైనర్ (minor girl). అయినా కూడా ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. అంతే ప్రియుడు దిమ్మతిరిగే పథకం రచించాడు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనుకున్నాడు. ఆధారే అన్నింటికీ ఆధారం అనుకున్నట్టున్నాడు పాపం. గుట్టుచప్పుడు కాకుండా ఆధార్ సెంటర్‌కు వెళ్లి అమ్మాయి బర్త్‌డే వయసు (date of birth) మార్పించేశాడు. అనంతరం ఇద్దరూ మ్యారేజ్ (marriage) చేసేసుకున్నారు. కానీ బాలిక తండ్రి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడడంతో చివరకు ప్రియుడు కటకటాలపాలయ్యాడు.

మహారాష్ట్ర ముంబైలోని (Mumbai) దహీసర్‌కు చెందిన ఓ యువకుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి వయసు 23 కాగా.. అమ్మాయికి ఇంకా మైనార్టీ తీరలేదు. ఇలాగైతే గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి కాదని భావించాడు. కానీ వివాహం చేసుకోవాలనుకున్నారు. అంతే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకూడదని భావించి ఆధార్‌కార్డు (aadhar card)లో పుట్టిన తేదీని మార్పించేశాడు. అనంతరం సోమవారం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను కలిసి సాయం కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కానీ ఖాకీలకు అనుమానం వచ్చీ బాలిక తండ్రిని స్టేషన్‌కు పిలిపించారు. తన కుమార్తె మైనర్ అని.. కావాలంటే చూడండి అంటూ అమ్మాయి బర్త్‌ సర్టిఫికెట్ పోలీసుల ముందుంచాడు. దీంతో ప్రియుడి చేసిన నిర్వాకం చూసి పోలీసులు ఖంగుతిన్నారు. అంతేకాకుండా తన కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్, మోసం, ఫోర్జరీ, బాల్యవివాహాలకు సంబంధించిన నేరాలకు పాల్పడినట్లు ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు దహీసర్‌ పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Viral Video: కొంగ-ఆరిఫ్ కథలాగే మరో అరుదైన బంధం.. ఈ కుర్రాడిని వదిలి పెట్టని ఆవు.. సెల్ఫీలు తిగుతోంటే ఫోజులు కూడా పెడుతోంది..!

ఇది కూడా చదవండి: ఈ ఒక్క దున్నతో నెలకు రూ.9.60 లక్షల సంపాదన.. అసలు దీని ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ఇది కూడా చదవండి: Viral News: బాబోయ్.. ఈ పిల్లాడి పట్టుదల మామూలుగా లేదుగా.. తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు..!

Updated Date - 2023-04-14T14:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising