ODI World Cup 2023: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడికి దక్కని చోటు!
ABN, First Publish Date - 2023-08-07T16:04:22+05:30
మరో రెండు నెలల్లో ప్రారంభంకాబోయే వన్డే ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌నకు తమ టీంను ప్రకటించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
మరో రెండు నెలల్లో ప్రారంభంకాబోయే వన్డే ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌నకు తమ టీంను ప్రకటించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. మొత్తం 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇందుకు సంబంధించిన వివరాలను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం ఆసీస్‌కు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమ్మిన్సే ప్రపంచకప్‌లోనూ కంగారు టీంను నడిపించనున్నాడు. ఇదే జట్టు సౌతాఫ్రికాతో జరిగే 5 వన్డేల సిరీస్, భారత్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌లోనూ తలపడనుంది. కాగా ఈ 18 మందిలో నుంచే 15 మందిని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయనున్నారు. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టులో 15 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండకూడదనే విషయం తెలిసిందే.
కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా 6 వారాలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటిచింది. దీంతో అతను సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచకప్ జట్టులో స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో స్టార్ బ్యాటరైనా లబుషేన్ 2020లో వన్డే జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 30 టెస్టులు ఆడి 31 సగటుతో 847 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.
ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Updated Date - 2023-08-07T16:04:22+05:30 IST