ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: బ్యాడ్ న్యూస్.. భారత్ vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం

ABN, First Publish Date - 2023-09-17T15:19:14+05:30

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టాస్ వేసి సరిగ్గా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు.

కొలంబో: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టాస్ వేసి సరిగ్గా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రస్తుతం మ్యాచ్ వేదికైన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం పడుతుంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. కాగా వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ సాధ్యం కాకపోతే రేపు రిజర్వ్ డే కూడా ఉంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో శ్రీలంక టాస్ గెలిచింది. టాస్ గెలిచిన దసున్ శనక ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు శనక చెప్పాడు. మహేష్ తీక్షణ స్థానంలో దుషన్ హేమంతను తుది జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఈ రోజ్ మ్యాచ్ ఆడుతున్నట్టు చెప్పాడు. అలాగే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అక్షర్ పటేల్ అందుబాటులో లేడని, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.



తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశల్ పెరీరా, కుశల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన

Updated Date - 2023-09-17T15:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising