ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ABN, First Publish Date - 2023-07-19T16:27:55+05:30
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆగష్టు 30న టోర్నీ ప్రారంభమై సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా జరగనుంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆగష్టు 30న టోర్నీ ప్రారంభమై సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా జరగనుంది. గ్రూప్ స్టేజీలో భారత జట్టు.. పాకిస్థాన్‌తోపాటు నేపాల్‌తో కూడా ఓ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 4న ఈ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్‌నకు ముందు జరగనున్న ఆసియా కప్ ఈ సారి వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. ఆసియా కప్‌నకు ఈ సారి హైబ్రిడ్ పద్దతిలో శ్రీలంక, పాకిస్థాన్ అతిథ్యమివ్వనున్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనుండగా.. అత్యధికంగా శ్రీలంకలో 9, పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. 3 జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్.. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఆయా గ్రూప్‌ల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మూడు సార్లు తలపడే అవకాశాలున్నాయి. ఇక ఆగష్టు 30న జరగనున్న టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడనున్నాయి. పాకిస్థాన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు గ్రూప్ దశ పోటీలు జరగనుండగా.. సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు సూపర్ 4 పోటీలు జరగనున్నాయి. శ్రీలంకలోని కొలంబో వేదికగా సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.
Updated Date - 2023-07-19T16:27:55+05:30 IST