ప్రధాని జోక్యంతో రిటైర్మెంట్ వెనక్కి
ABN , First Publish Date - 2023-07-08T01:13:57+05:30 IST
క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నాడు.

బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ యూటర్న్
ఢాకా: క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నాడు. శుక్రవారం దేశ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయిన తమీమ్.. రిటైర్మెం ట్‌పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించాడు. ఆరు వారాలు విశ్రాంతి తీసుకుని, తిరిగి క్రికెట్ ఆడతానని తెలిపాడు. ‘ప్రధాని నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు. సుదీర్ఘమైన చర్చ అనంతరం ఆమె నన్ను తిరిగి క్రికెట్ ఆడాలని ఆదేశించారు. దేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి (హసీనా)కి నో చెప్పలేన’ని ప్రధానితో భేటీ తర్వాత తమీమ్ వెల్లడించాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాను వెనక్కి తీసుకోనే విషయంలో బంగ్లా మాజీ కెప్టెన్ మోర్తజా, బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హస్సన్ ఒత్తిడి కూడా ఉందన్నాడు.