Rohit Sharma: గజినీలా మారిన రోహిత్.. కప్పు గెలిచిన సంగతి మర్చిపోయి..
ABN , Publish Date - Mar 10 , 2025 | 10:44 AM
IND vs NZ Highlights: హిట్‌మ్యాన్ రోహిత్‌కు మర్చిపోయే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా సార్లు ఇబ్బంది పడిన భారత సారథి మరోమారు గజినీలా మారిపోయాడు. అతడేం చేశాడో ఇప్పుడు చూద్దాం..

భారత సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్, కెప్టెన్సీతోనే కాదు.. మతిమరుపుతోనూ అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. పర్స్ దగ్గర నుంచి పాస్‌పోర్ట్ వరకు.. మొబైల్ ఫోన్ నుంచి లగేజీ దాకా అతడు చాలాసార్లు అనేక వస్తువులు, విషయాలను మర్చిపోవడం తెలిసిందే. ఆఖరుకు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలెవన్‌ను మర్చిపోవడం, టాస్ నెగ్గాక బ్యాటింగ్-బౌలింగ్‌లో ఏది తీసుకోవాలో గుర్తుపెట్టుకోక కన్‌ఫ్యూజ్ అయిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా అతడు మరోమారు గజినీలా మారిపోయాడు. ఈసారి ఏం మర్చిపోయాడో ఇప్పుడు చూద్దాం..
జోకులే జోకులు
మతిమరుపులో రోహిత్‌ది పీహెచ్‌డీ అని సహచర ఆటగాళ్లు జోకులు వేస్తుంటారు. ఇది మరోమారు ప్రూవ్ అయింది. ఈసారి అతడు మర్చిపోయిన వస్తువు గురించి తెలిస్తే షాక్ అవ్వక మానరు. మూడు వారాల పాటు ఎంతో కష్టపడి, టీమ్ కోసం చెమటోడ్చి మరీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్పును అందించాడు రోహిత్. అయితే ఆ ట్రోఫీని తీసుకెళ్లడం అతడు మర్చిపోయాడు. కివీస్‌తో ఫైనల్స్ ముగిశాక నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హిట్‌మ్యాన్ పాల్గొన్నాడు. మ్యాచ్ విశేషాలన్నీ మాట్లాడాక ఆఖర్లో కప్పును తీసుకోకుండానే వెళ్లిపోయాడు.
కప్పు వదిలేసి..
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కప్పును పదే పదే చూస్తూ, దాన్ని పట్టుకొని చాలా విశేషాలు పంచుకున్నాడు రోహిత్. అయితే ఆఖర్లో దాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి దాన్ని తీసుకెళ్లి హిట్‌మ్యాన్‌కు ఇచ్చాడు. దీంతో రోహిత్ గజినీలా మారాడని.. కప్పు మర్చిపోవడం ఏంటి బ్రో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పోయి పోయి కప్పే మర్చిపోయాడు.. హిట్‌మ్యాన్ అస్సలు మారడని జోకులు వేస్తున్నారు. అయితే రోహిత్ కప్పు మర్చిపోలేదని.. ట్రోఫీని ఇతర స్టాఫ్ తీసుకొని వస్తారని, అందులో అతడి తప్పేం లేదని మరికొందరు నెటిజన్స్ చెబుతున్నారు. ఏదేమైనా కప్పు గెలిచాక భారత ఆటగాళ్లు చేసే ప్రతి పని వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
రోహిత్‌కు అనుష్క హగ్.. రితికా ముందే..
అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క
రోహిత్ హాఫ్ సెంచరీ.. ఊచకోతకు డిసైడై వచ్చాడుగా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి