ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crybaby: నోట్లో పాలపీకతో ఉన్న ఈ ఆటగాడిని గుర్తుపట్టారా..? ఈ గొడవేంటంటే..

ABN, First Publish Date - 2023-07-04T11:51:37+05:30

ఆస్ట్రేలియా వార్తా పత్రిక ‘ది వెస్ట్రన్ ఆస్ట్రేలియా’.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను క్రై బేబిగా ఉద్దేశిస్తూ సోమవారం నాడు ఫోటోలను ప్రచురించింది. బెన్ స్టోక్స్ అండర్‌వేర్‌తో నోట్లో పాలపీక పెట్టుకున్న ఫొటోలతో వ్యంగ్యంగా ఒక కథనాన్ని ప్రచురించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య చివరి వరకు హోరాహోరీగా సాగిన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసినప్పటికీ, బెయిర్‌స్టో ఔట్‌పై మాత్రం వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఆస్ట్రేలియా వార్తా పత్రిక ‘ది వెస్ట్రన్ ఆస్ట్రేలియా’.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను క్రై బేబిగా ఉద్దేశిస్తూ సోమవారం నాడు ఫోటోలను ప్రచురించింది. బెన్ స్టోక్స్ అండర్‌వేర్‌తో నోట్లో పాలపీక పెట్టుకున్న ఫొటోలతో వ్యంగ్యంగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఆస్ట్రేలియా జట్టు క్రీడా నిబంధనలకు అనుగుణంగానే ఆడినా చీటింగ్ చేయడంలో ఇంగ్లండ్ కొత్తపుంతలు తొక్కిందని సదరు పత్రిక ఆరోపించింది. ఇది కాస్తా వైరల్‌ కావడంతో తాజాగా స్టోక్స్ స్పందించాడు. ‘‘ అది కచ్చితంగా నేను కాదు. నేను ఎప్పటి నుంచో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నాను’’ అని తన ట్విట్టర్ ఖాతాలో ఆస్ట్రేలియా మీడియాకు స్టోక్స్ కౌంటరిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే.. యాషెస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఐదో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్ స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటయ్యాడు. బంతి కీపర్ చేతిలో ఉండగానే ఓవర్ పూర్తైందనుకుని క్రీజు దాటాడు. ఇది గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ వెంటనే స్టంపౌట్ చేశాడు. దీనిని సుదీర్ఘంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ చివరకు బెయిర్ స్టో ఔటైనట్టుగా ప్రకటించాడు. ఈ నిర్ణయం ఇంగ్లండ్ జట్టు ఓటమిపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో ఆ జట్టు ఓడిపోయింది.

అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు మాజీలు, మీడియా మధ్య వివాదం రాజుకుంది. రెండు దేశాల ప్రధాన మంత్రులు ఈ వ్యవహారంపై స్పందించడం గమనార్హం. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై మీడియాలో విమర్శలు వెలువెత్తాయి. ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని ఇంగ్లండ్ మాజీలు ఆరోపిస్తున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్‌లు గెలవాలని ఎప్పటికీ కోరుకోమని అన్నాడు. దీనిపై స్టోక్స్‌ను క్రైబేబీగా పోలుస్తూ ఆసీస్ వార్తాపత్రిక వార్తలను ప్రచురించింది. నిజానికి క్రికెట్ రూల్స్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ సరైనదే. కానీ ఓవర్ అయిపోందనే భ్రమలో బెయిర్ స్టో క్రీజు దాటాడు కాబట్టి.. అతన్ని ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2023-07-04T11:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising