ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: విరాట్ కోహ్లీ క్రికెటర్ కాకపోయింటే WWE రెజ్లర్ అయ్యేవాడు: భువనేశ్వర్ కుమార్

ABN, First Publish Date - 2023-08-22T16:36:07+05:30

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెటర్ కాకపోయి ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ (World Wrestling Entertainment) అయి ఉండేవాడని సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సరదాగా వ్యాఖ్యానించాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెటర్ కాకపోయి ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ (World Wrestling Entertainment) అయి ఉండేవాడని సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సరదాగా వ్యాఖ్యానించాడు. అలాగే టీమిండియాలో తానే అత్యుత్తమ బౌలర్ అని కోహ్లీ భావిస్తాడని చెప్పుకొచ్చాడు. సియాట్(CEAT) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ కోహ్లీ క్రికెటర్ కాకపోయి ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్(WWE) అయ్యేవాడు. కోహ్లీ జట్టులో తానే అత్యుత్తమ బౌలర్ అని భావిస్తాడు. కానీ అతను బౌలింగ్ చేసినప్పుడు మేము భయపడేవాళ్లం. ఎందుకంటే అతని బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎక్కడ గాయపడతాడోనని కంగారు పడేవాళ్లం.’’ అని భువనేశ్వర్ కుమార్ సరదాగా వ్యాఖ్యానించాడు.


33 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌కు విరాట్ కోహ్లీతో మంచి చనువే ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో భువి అనేక మ్యాచ్‌లు ఆడాడు. ఆ చనువుతోనే కోహ్లీపై భువి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక జట్టు అవసరాల దృష్యా పలు మ్యాచ్‌ల్లో కోహ్లీ పార్ట్ టైమ్ బౌలర్‌గా బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే ఫామ్ లేమి కారణంగా దాదాపు సంవత్సర కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరఫున చివరి మ్యాచ్‌ను గత నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు. గత ఐపీఎల్‌లో సత్తా చాటినప్పటికీ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. సోమవారం నాడు ప్రకటించిన ఆసియా కప్ జట్టులో కూడా భువికి చోటు దక్కలేదు. యువ బౌలర్లు దూసుకురావడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కకపోయినప్పటికీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భువనేశ్వర్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్‌లో భువి ఇప్పటివరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 63, వన్డేల్లో 141, టీ20ల్లో 90 వికెట్లు తీశాడు.

Updated Date - 2023-08-22T16:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising