ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Baig sir: ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ క్రికెటర్ కన్నుమూత

ABN, First Publish Date - 2023-10-02T10:10:08+05:30

ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బేగ్ సార్ ఇక లేరు. 84 ఏళ్ల బేగ్ సార్ ఛాతీ నొప్పితో గత రాత్రి తుది శ్వాస విడిచారు.

హైదరాబాద్: ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బేగ్ సార్ ఇక లేరు. 84 ఏళ్ల బేగ్ సార్ ఛాతీ నొప్పితో గత రాత్రి తుది శ్వాస విడిచారు. మెహదీపట్నం శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా ముగిశాయి. కాగా తన క్రికెట్ కెరీర్‌లో బేగ్ సార్ నేవీ నుంచి సర్వీస్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కోచ్‌గా విశిష్ట సేవలు అందించారు. భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, రవిశాస్త్రి, అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఎల్ శివరామకృష్ణన్, భరత్ అరుణ్, సంజయ్ మంజ్రేకర్, ఎంఎస్‌కే ప్రసాద్, రాబిన్ ఉతప్ప, నోయెల్ డేవిడ్, పూర్ణిమా రావు, రజనీ వేణుగోపాల్ వంటి అనేక అంతర్జాతీయ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు. తన కోచింగ్ కెరీర్‌లో 100 మంది ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు. మాల్దీవుల క్రికెట్ టీంకు కూడా కోచ్‌గా పని చేశారు. తన విశిష్టమైన కోచింగ్ కెరీర్‌లో బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్‌ఏఐ, ఎస్‌ఏఏపీ, ఏసీఏలకు సేవలందించారు. మొత్తంగా క్రికెట్ ఆటకు నిస్వార్థ సేవ చేసిన చిరస్మరణీయుడిగా బేగ్ సార్ నిలిచిపోయారు.

Updated Date - 2023-10-02T10:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising