కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ben Stokes: ఇంగ్లండ్‌కు శుభవార్త.. వన్డే ప్రపంచకప్ హీరో యూటర్న్

ABN, First Publish Date - 2023-08-16T20:06:48+05:30

2019 వన్డే ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. వన్డేలకు గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ మేరకు బుధవారం నాడు 15 మంది సభ్యులతో ప్రొవిజనల్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఈసీబీ ప్రకటించిన జట్టులో గత ప్రపంచకప్‌లో రాణించిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు.

Ben Stokes: ఇంగ్లండ్‌కు శుభవార్త.. వన్డే ప్రపంచకప్ హీరో యూటర్న్

వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. 2019 వన్డే ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. వన్డేలకు గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ మేరకు బుధవారం నాడు 15 మంది సభ్యులతో ప్రొవిజనల్ జట్టును ఈసీబీ ప్రకటించింది. తమ విజ్ఞప్తిని మన్నించి బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడని ఈసీబీ తెలిపింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌లకు కూడా వేర్వేరుగా ఈసీబీ జట్లను వెల్లడించింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ స్టోక్స్ ఆడనున్నాడు.

ఇది కూడా చదవండి: Ireland T20 Series: చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా రికార్డు..!!

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నాలుగు టీ20ల సిరీస్ జరగనుండగా.. సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు వన్డే సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ ముందు టీమ్ పర్పామెన్స్‌‌ను అనలైజ్ చేసి సెలక్టర్లు జట్టు ఎంపికను ఫైనలైజ్ చేయనున్నారు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనుంది. అయితే ఈసీబీ ప్రకటించిన జట్టులో గత ప్రపంచకప్‌లో రాణించిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సర్రే ఫాస్ట్ బౌలర్ అట్కిన్సన్‌కు సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. ప్రస్తుతం అతడు ఇంగ్లండ్‌లో జరుగుతున్న పురుషుల హండ్రెడ్ బాల్ లీగ్‌లో ఆడుతూ రాణిస్తున్నాడు.

ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ ప్రొవిజనల్ టీమ్: జాస్ బట్లర్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జోరూట్, జాసన్ రాయ్, మొయిన్ అలీ, బెయిర్ స్టో, శామ్ కరన్, లివింగ్ స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, రాస్ టోప్లీ, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ టీమ్: జాస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, అట్కిన్సన్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, శామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ టీమ్: జాస్ బట్లర్(కెప్టెన్), జాసన్ రాయ్, మొయిన్ అలీ, జోరూట్, అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కర్రన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, రాస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్

Updated Date - 2023-08-16T20:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising