ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ICC Rankings: బాబర్ నంబర్ వన్ స్థానంపై గిల్ గురి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ జోరు

ABN, First Publish Date - 2023-10-25T14:39:25+05:30

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఏకంగా ముగ్గురు బ్యాటర్లు టాప్ 3లో ఉండడం గమనార్హం.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఏకంగా ముగ్గురు బ్యాటర్లు టాప్ 3లో ఉండడం గమనార్హం. అది కూడా మన టాప్ 3 బ్యాటర్లే కావడం విశేషం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మొదటి ర్యాంకులో ఉన్న బాబర్ అజామ్‌కు రెండో ర్యాంకులో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు 6 పాయింట్లు మాత్రమే తేడా ఉన్నాయి. ప్రస్తుతం బాబర్ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లు ఉండగా.. గిల్ ఖాతాలో 823 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దీంతో త్వరలోనే గిల్ మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కనుక గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడితే మొదటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో బాబర్ నంవబర్ వన్ స్థానంపై గిల్ గురి పెట్టాడనే చెప్పుకోవాలి. అయితే ఈ టోర్నీలో బాబర్ అజామ్, శుభ్‌మన్ గిల్ నుంచి ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. 5 మ్యాచ్‌లాడిన బాబర్ అజామ్ 31 సగటుతో 157 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మూడు మ్యాచ్‌లాడిన గిల్ కూడా 31 సగటుతో 95 పరుగులే చేశాడు.


ఇక ఈ టోర్నీలో దుమ్ములేపుతున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏకంగా 118 సగటుతో 354 పరుగులు బాదిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి దూసుకెళ్లాడు. ఇక 62 సగటుతో 311 పరుగులు చేసిన రోహిత్ శర్మ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్(407) మూడో స్థానంలో ఉన్నాడు. డికాక్ ఖాతాలో ప్రస్తుతం 769 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. డికాక్‌తోపాటు మరో ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా టాప్ 10లో ఉన్నారు. 756 రేటింగ్ పాయింట్లతో హెన్రిక్ క్లాసెన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 716 రేటింగ్ పాయింట్లున్న డస్సెన్ 9వ స్థానంలో ఉన్నాడు. దీంతో బ్యాటింగ్ విభాగంలో సౌతాఫ్రికా నుంచి కూడా ముగ్గురు బ్యాటర్లు టాప్10లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి మహ్మద్ సిరాజ్ రెండో స్థానంలో, కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.

Updated Date - 2023-10-25T14:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising