ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hanuma Vihari: విహారికి తండ్రిగా ప్రమోషన్.. చిన్నారికి ఏం పేరు పెట్టారో తెలుసా?

ABN, First Publish Date - 2023-07-17T21:33:30+05:30

ఇటీవల కెప్టెన్‌గా దులీప్ ట్రోఫీ టైటిల్‌ను సాధించిన టీమిండియా తెలుగు తేజం హనుమ విహారి తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు. ఈనెల 7న తన భార్య ప్రీతి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా తెలుగుతేజం 29 ఏళ్ల హనుమ విహారి (Hanuma Vihari) డబుల్ జాక్‌పాట్ సాధించాడు. ఇటీవల కెప్టెన్‌గా దులీప్ ట్రోఫీ (Duleep Trophy 2023) టైటిల్‌ను కైవసం చేసుకోగా మరోవైపు తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. దీంతో అటు కెరీర్ పరంగా.. ఇటు వ్యక్తిగతంగా విహారి ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నాడు. ఈ మేరకు తమ దంపతులకు బాబు పుట్టినట్లు హనుమ విహారి సోషల్ మీడియా (Social Media) వేదికగా అభిమానులకు ప్రకటించాడు. ఈనెల 7న తన భార్య ప్రీతి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. తమ ఫ్యామిలీలో నెలకొన్న ఆనందాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని విహారి చెప్పాడు. తమ బిడ్డకు ఇవాన్ కీష్ (Ivaan Kiesh) అని నామకరణం చేసినట్లు అతడు పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: Dwane Bravo: మినీ ఐపీఎల్‌లో వెస్టిండీస్ స్టార్ భారీ సిక్సర్లు

తండ్రి అయినందుకు హనుమ విహారికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ గాయకుడు శ్రీరామచంద్ర కూడా ప్రత్యేకంగా విహారి దంపతులకు కంగ్రాట్స్ తెలియజేశాడు. దులీప్ ట్రోఫీకి ముందు ఐపీఎల్‌లో జియో సినిమా కోసం విహారి కామెంటేటర్ అవతారం ఎత్తాడు. అయితే ఇటీవల వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు తనను జట్టులోకి తీసుకోకపోవడంతో విహారి నిరాశ చెందాడు. దీంతో దులీప్ ట్రోఫీలో తన సత్తా చాటుకున్నాడు. తన నాయకత్వంలో సౌత్ జోన్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కాగా హనుమ విహారి తన అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో మొత్తం 839 పరుగులు చేశాడు. త్వరలోనే టీమిండియాకు ఎంపికవుతానని విహారి ధీమాతో ఉన్నాడు.

Updated Date - 2023-07-17T21:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising