ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WTC Final: ఈ ఒక్క మ్యాచ్ గెలిచి ఉంటే భారత్ కథ మరోలా ఉండేది! కానీ..

ABN, First Publish Date - 2023-03-03T18:01:46+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్‌(Team India)కు దారుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్‌(Team India)కు దారుణ పరాభవం ఎదురైంది. తొలి రెండు టెస్టుల్లో దుమ్మురేపిన టీమిండియా మూడో టెస్టులో మాత్రం చతికిలపడింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా ఈ ఒక్క మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో భారత జట్టు ఉన్నప్పటికీ శ్రీలంక(Sri Lanka) రూపంలో భారత్‌కు ముప్పు పొంచి ఉంది.

తొలి రెండు టెస్టుల్లోనూ భారత జట్టు విజయం సాధించి దూకుడు మీద ఉండడంతో సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేస్తుందని భావించారు. అయితే, తొలి రెండు పరాజయాలతో కాక మీదున్న ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుని మూడో టెస్టులో అద్భుత విజయం అందుకుంది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా 68.52 పర్సంటేజీతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఇండియా 60.29 శాతానికి పడిపోయినప్పటికీ రెండో స్థానంలోనే ఉంది. శ్రీలంక 53.33 శాతంతో మూడో స్థానంలో ఉంది.

ఇప్పుడు ఇండియా పరిస్థితేంటో చూద్దాం

మూడో టెస్టులో భారత్‌పై విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌తో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఓడినా 65 శాతంతో మొదటి స్థానంలోనే ఉంటుంది. అయితే, ఆసీస్‌తో జరిగే నాలుగో టెస్టులో భారత్ కనుక గెలిస్తే ఇక ఢోకా ఉండదు. ఓడితేనే చిక్కంతా.

నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే..

నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే భారత్ ఖాతాలో 63.0 శాతం పర్సంటేజీ పాయింట్లు ఉంటాయి. అప్పుడు డబ్ల్యూటీసీలో రోహిత్ సేన రెండో స్థానానికి చేరుకుంటుంది. మార్చి 9 నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. శ్రీలంక కనుక 2-0తో విజయం సాధిస్తే దాని పర్సంటేజీ పాయింట్లు 61.0 అవుతాయి. అయినప్పటికీ అది మూడో స్థానానికే పరిమితం అవుతుంది కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా-భారత్ తలపడతాయి.

నాలుగో టెస్టు డ్రా అయితే..

మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు కనుక డ్రా అయితే సిరీస్ 2-1తో భారత్ సొంతమవుతుంది. కానీ, 59.0 పర్సంటేజీతో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. అప్పుడు శ్రీలంక ఫైనల్‌కు వెళ్లే చాన్సుంది. అలా జరగకుండా ఉండాలంటే శ్రీలంక ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయకూడదు. ఒకవేళ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం పాయింట్ల పట్టికలో భారత్‌ను శ్రీలంక అధిగమిస్తుంది. 61.0 శాతంతో రెండో స్థానానికి చేరుకుంటుంది.

నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే..

అహ్మదాబాద్‌లో జరిగే నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే టెస్టు సిరీస్ 2-2తో డ్రా అవుతుంది. ఆ పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ను శ్రీలంక 2-0తో ఓడిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0తో విజయం సాధించినా, 1-1తో డ్రా అయినా శ్రీలంక ఆశయలు అడియాసలవుతాయి.

కాబట్టి భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఆశలు శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్‌పై ఆధారపడి ఉన్నట్టే. శ్రీలంక ఆడేది స్వదేశంలో కాదు కాబట్టి కివీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యం. అయితే, క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే కాబట్టి చివరి వరకు ఏమీ ఊహించలేం.

Updated Date - 2023-03-03T18:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!