ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs NZ Semi-Final: టీమిండియా గెలవాలని అభిమానుల ప్రార్థనలు.. ఆలయాలలో పూజలు

ABN, First Publish Date - 2023-11-15T12:28:54+05:30

India vs New Zealand: దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. అభిమానులంతా టీమిండియా నామజపంలో మునిగిపోయారు. బుధవారం జరిగే మొదటి సెమీస్ పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అభిమానులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పలువురు అభిమానులైతే ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ముంబై: దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. అభిమానులంతా టీమిండియా నామజపంలో మునిగిపోయారు. బుధవారం జరిగే మొదటి సెమీస్ పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అభిమానులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పలువురు అభిమానులైతే ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆచార్య గౌరంగ్ అనే పండిట్ గుజరాత్‌లోని బనస్కాంతలోని శక్తిపీఠ్ అంబాజీ ఆలయంలో భారత జట్టు విజయం కోసం శ్లోకాలను పఠించారు. నేటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. టీమిండియా విజయం కోసం అంబాజీని ప్రార్థిస్తున్నామని ప్రకాష్ జోషీ అనే భక్తుడు తెలిపాడు. చివరిసారి ఓడిపోయమని, ఈ సారి మాత్రం ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షించాడు. మధురైలోని జల్లికట్టు రోటరీ క్లబ్‌లో టీమిండియా విజయం కోసం అభిమానులు ప్రార్థనలు చేశారు. ఒడిషాలోని ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయన్ టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఇసుకపై క్రికెట్ బ్యాట్ శిల్పాన్ని తయారు చేశాడు. దానిపై గుడ్ లక్ టీమ్ భారత్ ఫర్ సెమీ ఫైనల్ అని రాశాడు.


సాధారణ అభిమానులే కాదు రాజకీయాకులు, ఉన్నత అధికారులు కూడా టీమిండియా విజయం కోసం ప్రార్థిస్తున్నారు. బాబా విశ్వనాథ్ అశీర్వాదంతో టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఆటగాళ్లు చాలా బాగా ఆడుతున్నారన్న ఆయన జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్‌ వీరాభిమాని బషీర్ చాచా మాట్లాడుతూ సెమీస్‌లో టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇండియా ఫైనల్‌లో కూడా గెలుస్తుందని, రోహిత్ శర్మ ప్రపంచకప్ గెలుస్తాడని ఆయన అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టీమిండియా విజయం కోసం అభిమానులు ప్రార్థిస్తున్నారు. అనేక మంది అభిమానులు ఆలయాలకు వెళ్లి పూజలు కూడా చేస్తున్నారు. వేదమంత్రాల మధ్య దేవుడికి పూజలు చేసి, హారతులు ఇస్తున్నారు. నిండు మనస్సుతో టీమిండియా గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఓ దగ్గర అభిమానుల సమక్షంలో దేవుడికి పూజారులు పూజలు చేసి, హారతులు ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-11-15T12:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising