IND vs NZ Semi-Final: 81 పరుగులు చేస్తే సచిన్ రెండు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ
ABN, First Publish Date - 2023-11-15T13:06:25+05:30
IND vs NZ Semi-Final: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. సూపర్ ఫామ్‌లో కింగ్ కోహ్లీ బఠాణీలు తిన్నంత సునాయసంగా పరుగులు చేస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదేసిన కింగ్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 594 పరుగులు చేశాడు.
ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. సూపర్ ఫామ్‌లో కింగ్ కోహ్లీ బఠాణీలు తిన్నంత సునాయసంగా పరుగులు చేస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదేసిన కింగ్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 594 పరుగులు చేశాడు. సగటు ఏకంగా 99గా ఉండడం విశేషం. 9 మ్యాచ్‌ల్లో ఏడు సార్లు 50+ స్కోర్లు సాధించడం గమనార్హం. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై కూడా 95 పరుగులతో చెలరేగాడు. అయితే ఈ ప్రపంచకప్‌లో మరొక 81 పరుగులు చేస్తే 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డును కోహ్లీ బద్దలుకొడతాడు. ఆ ప్రపంచకప్‌లో సచిన్ చేసిన 673 పరుగులే ఇప్పటివరకు ఒక ఎడిషన్‌లో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులుగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా సచిన్ రికార్డు పదిలంగా ఉంది. దీంతో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే అద్భుత అవకాశం ప్రస్తుతం కోహ్లీకి వచ్చింది.
అలాగే విరాట్ కోహ్లీ మరొక 50+ స్కోర్ సాధిస్తే ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో ఏడేసి సార్లు ఈ మార్కు అందుకున్న సచిన్ టెండూల్కర్, షకీబ్ అల్ హసన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ కూడా ఇప్పటివరకు 7 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. అంతేకాకుండా వన్డేల్లో కోహ్లీ ఇంకొక సెంచరీ చేస్తే 50 సెంచరీలను పూర్తి చేసుకుంటాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు. ఇక క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకు భారత జట్టు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంది.
Updated Date - 2023-11-15T13:16:15+05:30 IST