ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA 1st ODI: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. టీమిండియా యువ బ్యాటర్ అరంగేట్రం

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:08 PM

టీమిండియాతో మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.

జోహన్నెస్‌బర్గ్: టీమిండియాతో మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. సౌతాఫ్రికా జట్టు నుంచి కూడా యువ పేసర్ నాంద్రే బర్గర్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక ఆల్ రౌండర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోంది. కాగా వన్డే క్రికెట్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 91 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా సౌతాఫ్రికా 50 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్ 38 మ్యాచ్‌ల్లో గెలిచింది.3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై పూర్తి అధిపత్యం కనబర్చిన భారత జట్టు ఘనవిజయం సాధించింది. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 3 వన్డేల్లో కూడా టీమిండియానే గెలిచింది.


తుది జట్లు

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ

భారత్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్/కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

Updated Date - Dec 17 , 2023 | 01:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising