ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: టీమిండియా హెడ్ కోచ్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ జాబితాలో మూడో స్థానానికి..

ABN, Publish Date - Dec 27 , 2023 | 01:42 PM

Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 38 పరుగులు చేశాడు. దీంతో భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ పోటీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా మూడో స్థానానికి చేరుకున్నాడు.

సెంచూరియన్: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 38 పరుగులు చేశాడు. దీంతో భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ పోటీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 1252 పరుగులు చేసిన మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లీ 1274 పరుగులున్నాయి. ఈ జాబితాలో 1741 పరుగులు చేసిన భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1305 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో, 1274 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, 1252 పరుగులు చేసిర రాహుల్ ద్రావిడ్ నాలుగో స్థానంలో, 976 పరుగులు చేసిన వీవీఎస్ లక్ష్మణ్ ఐదో స్థానంలో ఉన్నారు.


టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఓ మైలురాయిని ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆటలో హాఫ్ సెంచరీతో రాణించిన రాహుల్ విదేశాల్లో అన్ని ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. రాహుల్ కంటే ముందు ఈ ఘనత మహేంద్ర సింగ్ ధోని, రిషబ్ పంత్ సాధించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. ముఖ్యంగా కగిసో రబాడ (5/44) విజృంభణకు భారత బ్యాటర్లు దాసోహమయ్యారు. అతడి బౌన్స్‌, స్వింగ్‌ బంతులకు రోహిత్‌ (5), శ్రేయాస్‌ (31), విరాట్‌ కోహ్లీ (38), అశ్విన్‌ (8), శార్దూల్‌ (24) పెవిలియన్‌ చేరడం భారత్‌ను దెబ్బతీసింది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు ఆడిన కేఎల్‌ రాహుల్‌ (105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 బ్యాటింగ్‌) మాత్రం తన కళాత్మక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలిచాడు. అతడి పోరాటం కారణంగా తొలి రోజు మంగళవారం భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. అయితే ఆఖరి సెషన్‌ ఆరంభమైన కాసేపటికే వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. తొలి రోజు 31 ఓవర్ల ఆట కోల్పోయినందున బుధవారం మధ్యాహ్నం అరగంట ముందుగా... ఒంటి గంటకే మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌తో పాటు సిరాజ్‌ (0) ఉన్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అరంగేట్రం చేశాడు.

Updated Date - Dec 27 , 2023 | 01:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising