ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: మూడో టీ20కి టీమిండియా తుది జట్టులో 3 మార్పులు? ఎవరి స్థానంలో ఎవరంటే..

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:07 PM

Team india playing XI: రెండో టీ20లో ఓడి సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు గురువారం జరగనున్న కీలకమైన మూడో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది.

జోహన్నెస్‌బర్గ్: రెండో టీ20లో ఓడి సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు గురువారం జరగనున్న కీలకమైన మూడో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టీ20కి టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్‌తో పోలిస్తే ముఖ్యంగా భారత జట్టులో 3 ప్రధాన మార్పులు జరిగే అవకాశాలున్నాయి. గత మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరు కూడా డకౌట్ అయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌ను తప్పించి రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించే అవకాశాలున్నాయి. ఒక వేళ లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసం వెళ్తే ఓపెనింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూడో టీ20లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తిలక్ వర్మ పెదగా రాణించలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో 6 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను తిలక్ వర్మ ఆదుకున్నాడు. దూకుడుగా ఆడి 29 పరుగులు చేశాడు. కానీ దానిని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మూడో స్థానం కోసం తిలక్ స్థానంలో శ్రేయస్‌ను ఆడించే అవకాశాలున్నాయి.


నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రావడం ఖాయమే. పైగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న మ్యాచ్ ఫినిషర్ రింకూ సింగ్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్ రౌండర్ జడేజా ఏడో స్థానంలో ఆడనున్నాడు. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలించనుండడంతో ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. దీంతో జడేజాకు తోడుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వన్డే సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావడం ఖాయమని చెప్పుకోవాలి. ఇక పేసర్లుగా మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ కొనసాగనున్నారు. మన బ్యాటర్లు సత్తా చాటుతున్నప్పటికీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 14 , 2023 | 12:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising