Nagpur Test: కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన షమీ!
ABN, First Publish Date - 2023-02-11T18:29:52+05:30
ఆస్ట్రేలియా(Australia)తో ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో
నాగ్‌పూర్: ఆస్ట్రేలియా(Australia)తో ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగులో అదరగొట్టిన భారత జట్టు(Team India) ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించి 400 పరుగుల భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాకు సవాలు విసిరింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూ(Australia)లను బంతితో కలవరపెట్టిన భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలు కాగా, టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) అత్యంత అరుదైన రికార్డును అందుకోవడమే కాకుండా విరాట్ కోహ్లీ(Virat Kohli), యువరాజ్ సింగ్(Yuvraj Singh), కేఎల్ రాహుల్(KL Rahul) రికార్డులను బద్దలుగొట్టాడు. మూడో రోజు 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన షమీ క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.
టాడ్ మర్పీ వేసిన 131వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన షమీ తన ఉద్దేశాన్ని చాటాడు. మొత్తంగా మూడు సిక్సర్లు నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో అతడి ఖాతాలో 25 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 24 సిక్సర్లతో తనకంటే ముందున్న కోహ్లీని షమీ దాటేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో యువరాజ్ సింగ్ (21), కేఎల్ రాహుల్ (17) ఉన్నారు.
ఇక, ఓవరాల్‌గా ఇంగ్లిష్ క్రికెటర్ బెన్ స్టోక్స్ 107 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇండియా నుంచి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో టాప్-6లో ఉన్నాడు. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఢిల్లీలో ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1న జరగనున్న మూడో టెస్టుకు ధర్మశాల, 9 నుంచి జరగనున్న చివరిదైన నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తాయి. అనంతరం మార్చి 17 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
Updated Date - 2023-02-11T21:33:53+05:30 IST