Team india: టీ20ల్లో రోహిత్, కోహ్లీ భవితవ్యం తేల్చేది అతడేనా?
ABN, First Publish Date - 2023-07-04T17:11:19+05:30
టీ20ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యం త్వరలోనే తేలిపోనుంది. భారత జట్టుకు త్వరలో కొత్త చీఫ్ సెలక్టర్ రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్ టీ20ల భవితవ్యం కొత్త చీఫ్ సెలక్టర్ చేతిలో ఉన్నాయని బీసీసీఐ సీనియర్ అధికారి వ్యాఖ్యానించాడు.
టీమిండియా ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో బిజీబిజీగా మ్యాచ్‌లను ఆడుతోంది. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మాదిరిగా మూడు ఫార్మాట్లలో వేర్వేరు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా టీ20ల్లో సీనియర్ల కంటే జూనియర్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొంతకాలంగా టీ20లకు దూరమయ్యారు. ఐపీఎల్ మినహాయిస్తే వీళ్లిద్దరూ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి దాదాపు ఏడు నెలలు కావొస్తోంది. కోహ్లీ అయితే తన చివరి టీ20 మ్యాచ్ గత ఏడాది నవంబరులో ఆడాడు.
టీ20ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యం త్వరలోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు త్వరలో కొత్త చీఫ్ సెలక్టర్ రాబోతున్నాడు. బీసీసీఐ అంతర్గత విషయాలు వెల్లడించి చీఫ్ సెలెక్టర్ పదవి కోల్పోయిన చేతన్ శర్మ స్థానంలో కొత్త సెలెక్టర్‌ను నియమించేందుకు బీసీసీఐ దరఖాస్తులను నిర్వహించింది. ఈ పదవికి టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ దరఖాస్తు చేసుకోగా అతడికే చీఫ్ సెలక్టర్ పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్స్ కోచ్ పదవికి అగార్కర్ రాజీనామా చేశాడు.
కట్ చేస్తే.. కోహ్లీ, రోహిత్ టీ20ల భవితవ్యం కొత్త చీఫ్ సెలక్టర్ చేతిలో ఉన్నాయని బీసీసీఐ సీనియర్ అధికారి వ్యాఖ్యానించాడు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆటగాళ్లతో చర్చించడం చీఫ్ సెలెక్టర్ బాధ్యతల్లో ఒకటి అని.. రోహిత్, కోహ్లీ అందుకు అతీతులు కారన్నాడు. వాళ్లు కోరుకుంటే సుదీర్ఘ కాలం పాటు జట్టులో ఉండవచ్చని.. అయితే ఎంతటి గొప్ప ఆటగాళ్లు అయినా సమయం వచ్చినప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడటంతో పాటు ఐపీఎల్ కూడా ఆడటం అంత సులువైన పని కాదని సదరు బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపాడు.
Updated Date - 2023-07-04T17:21:05+05:30 IST