ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ICC Test Rankings: అగ్రస్థానంలోనే టీమిండియా స్పిన్ ద్వయం

ABN, First Publish Date - 2023-07-19T17:19:16+05:30

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో కొనసాగుతున్నాడు.

వెస్టిండీస్ (West Inidies) పర్యటనలో ఉన్న టీమిండియా (Team India) ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టును మూడు రోజుల్లో ముగించి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్ (Ravichandran Ashwin) ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు మొత్తం 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐసీసీ (ICC) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 884 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా తన ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు. 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరాడు. బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అతడి ఖాతాలో 828 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత కగిసో రబాడ (825 పాయింట్లు), జేమ్స్ ఆండర్సన్ (805 పాయింట్లు), షాహిన్ షా అఫ్రిది (787 పాయింట్లు), స్టువర్ట్ బ్రాడ్ (781 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.

బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ 883 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే టాప్-10లో ఉన్నాడు. 751 రేటింగ్ పాయింట్లతో అతడు పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ (874 పాయింట్లు), మూడో స్థానంలో బాబర్ ఆజమ్ (862 పాయింట్లు), నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ (855 పాయింట్లు), ఐదో స్థానంలో లబుషేన్ (849 పాయింట్లు), ఆరో స్థానంలో జో రూట్ (842 పాయింట్లు), ఏడో స్థానంలో ఉస్మాన్ ఖవాజా (824 పాయింట్లు), 8వ స్థానంలో డారిల్ మిచెల్ (792 పాయింట్లు), 9వ స్థానంలో కరుణరత్నె (780 పాయింట్లు) ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

మరోవైపు ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 449 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (362 పాయింట్లు) కొనసాగుతున్నాడు. షకీబుల్ హసన్ (332 పాయింట్లు), బెన్ స్టోక్స్ (331 పాయింట్లు), అక్షర్ పటేల్ (303 పాయింట్లు), జాసన్ హోల్డర్ (284 పాయింట్లు), జో రూట్ (256 పాయింట్లు), మిచెల్ స్టార్క్ (245 పాయింట్లు), కైల్ మేయర్స్ (245 పాయింట్లు), ప్యాట్ కమిన్స్ (229 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు ఈనెల 20 నుంచి వెస్టిండీస్-భారత్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్టులోనూ భారత స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా రాణించాలని జట్టు కోరుకుంటోంది.

Updated Date - 2023-07-19T17:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising