Team India: ఓపెనర్లు చెలరేగింది ఈరోజే.. రోహిత్-ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌కు ఐదేళ్లు
ABN, First Publish Date - 2023-08-29T15:00:18+05:30
2018లో ఆగస్టు 29న జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా తరఫున రోహిత్, ధావన్ జంట ఓపెనింగ్‌లో రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ చెలరేగి ఆడారు. ఛేజింగ్‌లో రోహిత్-ధావన్ జోడీ ఏకంగా తొలి వికెట్‌కు 33.3 ఓవర్లలో 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించింది.
టీమిండియాలో కొంతకాలంగా ఓపెనింగ్ జోడీ నిలకడగా ఆడటం లేదు. ఒకప్పుడు ఓపెనింగ్ అంటే గంగూలీ-సచిన్, సచిన్-సెహ్వాగ్, సెహ్వాగ్-గంభీర్ నిలకడగా ఆడేవాళ్లు. ఆ తర్వాత కొంతకాలం ఓపెనర్లుగా రోహిత్ శర్మ-ధావన్ జోడీ కూడా మంచి ఆటతీరును ప్రదర్శించింది. ధావన్ ఫామ్ కోల్పోయాక రోహిత్‌కు జోడీగా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో ఇంకా టీమిండియా ఓపెనింగ్ జోడీపై స్పష్టత రాలేదు. రోహిత్-గిల్ దిగుతారా లేదా రోహిత్-ఇషాన్ కొనసాగుతారా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.
కానీ 2018లో ఆగస్టు 29న జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా తరఫున రోహిత్, ధావన్ జంట ఓపెనింగ్‌లో రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ చెలరేగి ఆడారు. ఛేజింగ్‌లో రోహిత్-ధావన్ జోడీ ఏకంగా తొలి వికెట్‌కు 33.3 ఓవర్లలో 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించింది. రోహిత్ 111 నాటౌట్, ధావన్ 114 రన్స్‌తో సెంచరీలతో కదం తొక్కారు. ధావన్ 100 బాల్స్ ఆడి 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 114 రన్స్ చేసి రనౌట్‌గా వెనుతిరిగాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 119 బాల్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 111 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా 238 పరుగుల టార్గెట్‌ను 39.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా కప్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: టీమిండియాకు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం
మరికొద్దిరోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుండటం.. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడాల్సి ఉండటంతో క్రికెట్ అభిమానులు రోహిత్-ధావన్ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 90 బాల్స్‌లో 78 రన్స్ చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్ 66 బాల్స్‌లో 44 రన్స్ చేశాడు. టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్, కుల్‌దీప్ తలో రెండు వికెట్లతో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు.
Updated Date - 2023-08-29T15:46:31+05:30 IST