World Cup: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి జట్టుగా..
ABN, First Publish Date - 2023-11-13T10:46:01+05:30
ICC Cricket World Cup 2023: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొడుతున్న రోహిత్ సేన లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఒక ఓటమి కూడా లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. దీంతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొడుతున్న రోహిత్ సేన లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఒక ఓటమి కూడా లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. దీంతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే గతంలో శ్రీలంక(1996), ఆస్ట్రేలియా(2003) కూడా వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచినప్పటికీ అది రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో కాదు. అప్పుడు ప్రపంచకప్ పోటీలను గ్రూపులుగా విభజించి ఆడించారు. దీంతో మొత్తం 10 జట్లు కలిసి ఆడిన లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇక ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉంది. 2003, 2007 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచింది.
ఇక ఆదివారం జరిగిన లీగ్ దశ చివరి పోటీలో నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. 160 పరుగుల భారీ తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 410/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(128), కేఎల్ రాహుల్(102) సెంచరీలతో చెలరేగగా.. రోహిత్ శర్మ(61), శుభ్‌మన్ గిల్(51), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం మరోసారి కలిసికట్టుగా చెలరేగిన భారత బౌలర్లు నెదర్లాండ్స్‌ను 250 పరుగులకే ఆలౌట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 9 మంది బౌలర్లను ఉపయోగించడం గమనార్హం. చాలా కాలం తర్వాత బౌలింగ్ చేసిన రోహిత్, కోహ్లీ కూడా వికెట్లు తీసి సత్తా చాటారు. ఇక ఈ నెల 15న జరిగే మొదటి సెమీ ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. 16న జరిగే రెండో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Updated Date - 2023-11-13T10:46:02+05:30 IST