ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

ABN, First Publish Date - 2023-11-16T13:24:08+05:30

Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.

ముంబై: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది ప్రపంచకప్ టోర్నీలో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తే చాలు ఆ బౌలర్ స్థాయి పెరిగిపోతుంది. కానీ షమీ ప్రపంచకప్ టోర్నీలో ఈ ఘనతను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు సాధించాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అయితే షమీ విశ్వరూపం చూపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 5 వికెట్లు తీస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. నిజానికి ఈ టోర్నీలో షమీ మొదటి 4 మ్యాచ్‌లు ఆడనేలేదు. అయినప్పటికీ టోర్నీలో ప్రస్తుతానికి అత్యధిక వికెట్లు తీసింది షమీనే. ఇప్పటికే 3 సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన షమీ 23 వికెట్లతో టాప్ ప్లేసులో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో వేగంగా 50 వికెట్లను కూడా పూర్తి చేసుకున్నాడు.


షమీపై ఉన్న ఆరోపణలు

అయితే షమీ అద్భుత ప్రదర్శన ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. అంతకుమించిన ఆవేదన ఉంది. ఈ రోజు జేజేలు కొడుతున్న అభిమానులే ఓ సారి దారుణంగా హింసించారు. దేశ ద్రోహి అనే ముద్ర వేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డడాని ఆరోపించారు. డబ్బులు తీసుకుని టీమిండియా ఓడిపోయేలా చెత్త ప్రదర్శన చేశారని మండిపడ్డారు. షమీ దేశం నుంచి వెళ్లిపోవాలని, అతను పాకిస్థాన్ వెళ్లిపోవాలని తీవ్రంగా దూషించారు. దీనికి తోడు కట్టుకున్న భార్యే షమీని దారుణంగా హింసించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అని కూడా మరిచిపోయి చిత్రహింసలు పెట్టింది. కట్నం కోసం తనను వేధిస్తున్నాడని గృహహింస కేసు పెట్టింది. షమీకి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని అందులో ఆరోపించింది. తనపై అత్యాచారయత్నం, హత్యాయత్నం చేశాడని పేర్కొంది. కట్టుకున్న భర్తను కోర్టుకు లాగింది. కన్న బిడ్డను షమీకి దూరం చేసింది. ఇవన్నీ షమీ కెరీర్ మంచి ఊపులోనే ఉన్న సమయంలో జరిగాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు తోడు గాయాలు కూడా కావడంతో షమీ టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఆ సమయంలో తీవ్ర మానసిక వేధనకు గురైన ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు.

వివాహ బంధం వివాదాస్పదం

ఫ్యాషన్ డిజైరన్ అయిన హసిన్ జహాన్‌ను క్రికెటర్ మహ్మద్ షమీ 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. కానీ వీరి వివాహం బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2018లో షమీపై అతని భార్యనే తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. షమీపై గృహ హింస, వరకట్న వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. దూరంగా ఉన్నప్పటికీ కొంతకాలం విడాకులు తీసుకోలేదు. ఆ తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ చేసిన విచారణలో షమీ నిర్దోషిగా తేలాడు. ఆ తర్వాత షమీ, హసిన్ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కానీ ఈ వివాదం ఇంతటితో ముగియలేదు. తనకు నెలకు రూ.10 లక్షలు భరణం కావాలంటూ షమీ భార్య హసిన్ కోర్టును ఆశ్రయించింది. అందులో తన వ్యక్తిగత ఖర్చులకు రూ.7 లక్షలు, కుమార్తె పోషణకు రూ.3 లక్షలుగా పేర్కొంది. అయితే ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హసీన్ జహాన్‌కు షమీ నెలకు రూ.1.30 లక్షలు భరణంగా ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ఇందులో రూ.80 వేలు హసీన్ ఖర్చులకు, రూ.50 వేలు కూతురి పోషణకు వినియోగించాలని పేర్కొంది.

షమీ దేశ ద్రోహీ, పాకిస్థాన్ వెళ్లిపోవాలి

యూఏఈ వేదికగా 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓటమి షమీ ప్రాణం మీదికి వచ్చింది. ఆ మ్యాచ్‌లో నిజానికి మన బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 152 పరుగుల లక్ష్యాన్ని కాపాడడం సంగతి పక్కనపెడితే కనీసం ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో టీమిండియాకు దారుణ పరాజయం ఎదురైంది. ఈ ఓటమికి జట్టులోని ఆటగాళ్లందరి ఫేలవ ప్రదర్శన కారణమైనప్పటికీ పలువురు మాత్రం కేవలం షమీనే టార్గెట్ చేశారు. మిగతా బౌలర్లతో పోలిస్తే షమీ కాస్త ఎక్కువ పరుగులిచ్చాడనే కారణంతో అతడిపై దేశ ద్రోహీగా ముద్ర వేశారు. పాకిస్థాన్ అనుకూలవాదని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని దుమ్మెత్తిపోశారు. దేశం విడిచిపెట్టి పాకిస్థాన్ వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో దూషించారు. ఇందుకు అతను ముస్లిం కావడమే ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఆత్మహత్యాయత్నం

ఒక వైపు వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, గాయాలు, అదే సమయంలో యువ ఆటగాళ్లు జట్టులోకి దూసుకురావడంతో పేసర్ మహ్మద్ షమీ టీమిండియాలో చోటు కూడా కోల్పోయాడు. కొంతకాలం పాటు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన షమీ పలుమార్లు ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని స్వయంగా షమీనే వెల్లడించాడు. కాలమెప్పుడూ ఒకే విధంగా ఉండదు. మారుతుంటుంది. ఇవాళ ఉన్న కష్టాలన్నీ రేపు విజయానికి పునాదులుగా మారతాయి. షమీ విషయంలో అదే జరిగింది. కష్టాలన్నింటిని దిగుమింగుకుని గుండెన్ రాయి చేసుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన వ్యవసాయ పొలాన్నే క్రికెట్ పిచ్‌గా మార్చుకుని దానిపై ప్రతి రోజూ గంటలపాటు శ్రమించాడు. గాయాల నుంచి కోలుకున్నాడు. రాత్రి పగలు కఠోరంగా శ్రమించాడు. షమీ పట్టుదలకు కాలం తలవంచింది. జట్టులో మళ్లీ స్థానం దక్కింది. కానీ అప్పటికే కుర్రాళ్లు కర్చీఫ్ వేసేయడంతో కొంత కాలం తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో బఠాణీలు తిన్నంతా సులభంగా వికెట్లు తీస్తున్నాడు. ఇంతకాలం షమీని ఎందుకు ఆడించలేదని జట్టు మేనేజ్‌మెంటే బాధపడేలా చేస్తున్నాడు. మొత్తంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేడు ఛాంపియన్ బౌలర్‌గా ఎదిగిన మహ్మద్ షమీ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ప్రేరణగా చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-11-16T14:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising