ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రోహిత్ శర్మకు కోహ్లీ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

ABN, First Publish Date - 2023-02-10T17:06:24+05:30

ఆస్ట్రేలియా(Australia)తో ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియన్ స్కిప్పర్ రోహిత్ శర్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: ఆస్ట్రేలియా(Australia)తో ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియన్ స్కిప్పర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ బాది టెస్టుల్లో తన శతకాల సంఖ్యను 9కి పెంచుకున్నాడు. కోహ్లీ చేసిన ఓ చిన్న తప్పు కారణంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేజారిపోయే పరిస్థితి వచ్చింది. అయితే, రోహిత్ ఆ గండం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో నొచ్చుకున్న కోహ్లీ(Virat Kohli).. రోహిత్‌కు క్షమాపణలు చెప్పుకున్నాడు. 212 బంతుల్లో 120 పరుగులు చేసిన రోహిత్ ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్( Pat Cummins) బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో నాథన్ లయన్ వేసిన బంతిని ఆడిన కోహ్లీ పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ దాదాపు సగం దూరం వచ్చేశాడు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకున్న కోహ్లీ(Kohli) వెనక్కి వెళ్లిపొమ్మంటూ రోహిత్‌కు సైగ చేశాడు. సగం దూరం వచ్చేసిన రోహిత్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనక్కి మళ్లాడు. అయితే, అప్పటికే బంతి ఫీల్డర్ నుంచి లయన్ చేతికి అందింది. మెరుపు వేగంతో డైవ్ చేసిన రోహిత్ అవుటయ్యే ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు.

అది చూసిన కోహ్లీ నొచ్చుకున్నాడు. తన వల్ల అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌ను చూస్తూ క్షమాపణలు చెప్పాడు. రోహిత్ కూడా మరేం పర్లేదంటూ థంబ్ ఎత్తి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఇటీవల మళ్లీ పరుగుల వాన కురిపిస్తున్న కోహ్లీ(Virat Kohli) ఈ మ్యాచ్‌లో దారుణంగా నిరాశ పరిచాడు. 12 పరుగులు మాత్రమే చేసి టాడ్ మర్ఫీ బౌలింగులో వెనుదిరిగాడు. అది కూడా లంచ్ తర్వాత తొలి బంతికే అవుటై తీవ్ర నిరాశతో కోహ్లీ పెవిలియన్ చేరాడు. కోహ్లీ టెస్టుల్లో అర్ధ సెంచరీ చేసి ఏడాదికిపైనే అయింది. చివరిసారి గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై కేప్‌టౌన్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు నిరాశే. మరోవైపు, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ(Rohit Sharma) మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన ఏకైక ఇండియన్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

Updated Date - 2023-02-10T17:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising