ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK: శుభ్‌మన్ గిల్ వచ్చేశాడోచ్.. టాస్ మనదే.. తుది జట్టు ఇదిగో!

ABN, First Publish Date - 2023-10-14T13:42:27+05:30

క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు.

అహ్మదాబాద్: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. ముందుగా ఊహించినట్టుగానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని, గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపారు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడ్డాయి. 7 సార్లు భారత జట్టే విజయం సాధించింది. దీంతో ఈ సారి కూడా తమ రికార్డును కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగుతోంది.


తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

ఇక్కడ జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు సునాయసంగా చేధించింది. ఒకే ఒక వికెట్ కోల్పోయి ఏకంగా 82 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

Updated Date - 2023-10-14T13:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising