ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: ఈ పిచ్ బౌలర్లకు కష్టమైనది.. కానీ మేము ఆరంభంలోనే వికెట్లు తీయాలి: కుల్దీప్ యాదవ్

ABN, First Publish Date - 2023-11-13T14:29:30+05:30

India vs New Zealand: ఆసక్తికరంగా సాగిన వన్డే ప్రపంచకప్ లీగ్ దశ పూర్తైంది. ప్రస్తుతం అందరి చూపు ఈ నెల 15, 16న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ల పైనే ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఈ నెల 15న జరిగే మొదటి సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్.. 16న జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

ముంబై: ఆసక్తికరంగా సాగిన వన్డే ప్రపంచకప్ లీగ్ దశ పూర్తైంది. ప్రస్తుతం అందరి చూపు ఈ నెల 15, 16న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ల పైనే ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఈ నెల 15న జరిగే మొదటి సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్.. 16న జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే గత వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ భారత అభిమానులను కాస్త కలవరానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం కివీస్‌తో మ్యాచ్‌ను ఉద్దేశించి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడాడు. సెమీస్‌లో తమ వ్యూహాల గురించి పలు విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్ జరిగే ముంబైలోని వాంఖడే పిచ్‌పై బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని అన్ని అన్నాడు. టీమిండియా మ్యాచ్‌లో అధిపత్యం సాధించాలంటే త్వరగా వికెట్లు తీయాలని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో తాము ఆరంభంలోనే వికెట్లు సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.


‘‘ఇది బౌలింగ్ చేయడానికి కష్టమైన పిచ్. ఈ పిచ్‌పై బౌన్స్ ఉండడం నిజం. ఇక్కడ బ్యాటర్లు తరచుగా అధిపత్యం చెలాయిస్తుంటారు. ఈ పిచ్‌లో బౌలర్లు గేమ్‌లోకి రావడానికి సమయం పడుతుంది. అయితే టీ20 మ్యాచ్‌ల మాదిరిగా కాకుండా బౌలర్లు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మ్యాచ్‌లో అధిపత్యం చెలాయించాలంటే ఆరంభంలోనే వికెట్లు కావాలి. భారత్, న్యూజిలాండ్ మధ్య 4 సంవత్సరాల క్రితం 2019లో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత మేము చాలా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాము. కాబట్టి ఇక్కడి పరిస్థితుల గురించి మాకు తెలుసు. మేము ఈ టోర్నీ కోసం బాగా సన్నద్ధమయ్యాయి. టోర్నమెంట్ అంతా మంచి క్రికెట్ ఆడాం. ఇదే ఫామ్‌ను తర్వాతి మ్యాచ్‌లోనూ కొనసాగిస్తాం.’’ అని కుల్దీప్ యాదవ్ చెప్పాడు.

అలాగే ప్రస్తుత ప్రపంచకప్‌‌లో తన వ్యక్తిగత ప్రదర్శనపై కూడా ఈ లెఫ్టార్మ్ చైనామన్ స్పిన్నర్ మాట్లాడాడు. ‘‘నేను నా లయ, బలాలు, బ్యాటర్లు నా బౌలింగ్‌ను ఎలా ఆడడానికి ప్రయత్నిస్తున్నారనే దానిపై పని చేస్తాను. అయితే మంచి గుడ్ లెంగ్త్ బాల్స్ వేయడమే నా లక్ష్యం. బాల్స్‌ను వీలైనంత వరకు మంచి ఏరియాల్లో వేయడానికే ప్రయత్నిస్తాను. నేను కేవలం వికెట్లు తీయడంపైనే దృష్టి పెట్టను. తర్వాతి మ్యాచ్‌లోనూ నేను ఇదే విధంగా పని చేస్తాను.’’ అని కుల్దీప్ యాదవ్ తెలిపాడు. ఈ టోర్నీలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. కాగా ఈ టోర్నీలో కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు 14 వికెట్లు తీశాడు.

Updated Date - 2023-11-13T14:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising