ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS Final: ప్రపంచకప్ ఫైనల్లో అభిమానులను అలరించిన వాయుసేన విన్యాసాలు

ABN, First Publish Date - 2023-11-19T14:26:16+05:30

World Cup Final: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శన ఇచ్చాయి. మొత్తం 9 ఎయిర్‌క్రాఫ్ట్‌లు చేసిన విన్యాసాలు అలరించాయి.

అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శన ఇచ్చాయి. మొత్తం 9 ఎయిర్‌క్రాఫ్ట్‌లు చేసిన విన్యాసాలు అలరించాయి. రివ్వున గాల్లోకి ఎగిరిన ఎయిర్ క్రాఫ్ట్‌లు స్టేడియం మీదుగా దూసుకెళ్లాయి. పొగలు చిమ్ముతూ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లు ఆకాశంలోకి దూసుకెళ్లాయి. ఆకాశంలో పక్షుల మాదిరిగా ఎగురుతూ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చిన అభిమానులను అలరించాయి. ఇక ఈ మ్యాచ్‌ను చూడడానికి అనేక మంది ప్రముఖులు స్టేడియానికి తరలివచ్చారు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తోపాటు సినీ ప్రముఖులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే, ఊర్వశి రతౌలా తదితరులు స్టేడియానికి వచ్చారు.


ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌లు రెండు జట్లు కూడా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభంలో వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 8 విజయాలతో ఫైనల్ చేరింది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Updated Date - 2023-11-19T14:36:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising