ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World cup: డబుల్ సెంచరీతో 6 రికార్డులను బద్దలు కొట్టిన మాక్స్‌వెల్.. పాక్ ప్లేయర్ రికార్డు గల్లంతు.. భారత ఆటగాడిది మాత్రం..

ABN, First Publish Date - 2023-11-08T13:57:20+05:30

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా అజేయ డబుల్ సెంచరీ కొట్టి తన జట్టుకు ఒంటి చేతితో విజయాన్ని అందించాడు.

ముంబై: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా అజేయ డబుల్ సెంచరీ కొట్టి తన జట్టుకు ఒంటి చేతితో విజయాన్ని అందించాడు. ఒక వైపు గాయంతో బాధపడుతూనే మాక్స్‌వెల్ చేసిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 293 పరుగుల లక్ష్య చేధనలో 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచిన స్థితి నుంచి జట్టును మాక్స్‌వెల్ గెలిపించిన తీరు అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ విజయంతో ఆసీస్‌కు సెమీస్ బెర్త్ కూడా ఖరారు అయింది. ఈ మ్యాచ్ మొత్తంలో 128 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మాక్సీ 7 రికార్డులను బద్దలుకొట్టాడు.


1. వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరఫున డబుల్ సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా మాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 11వ బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2011లో బంగ్లాదేశ్‌పై షేన్ వాట్సన్ సాధించిన 185 పరుగుల రికార్డును మాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు.

2.లక్ష్య చేధనలో ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో 2021లో సౌతాఫ్రికాపై పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ చేసిన 193 పరుగుల రికార్డును మాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. మొత్తంగా లక్ష్య చేధనలో డబుల్ సెంచరీ కొట్టిన తొలి బ్యాటర్‌గా మాక్స్‌వెల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

3. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఏకంగా ఆరో స్థానంలో వచ్చి డబుల్ సెంచరీ కొట్టాడు. దీంతో వన్డే ఫార్మాట్లో ఓపెనర్‌గా కాకుండా డబుల్ సెంచరీ కొట్టిన తొలి నాన్ ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2009లో బంగ్లాదేశ్‌పై 194 పరుగులు చేసిన జింబాబ్వే ఆటగాడు చార్లెస్ కోవెంట్రీ రికార్డును మాక్స్‌వెల్ బద్దలుకొట్టాడు.

4. వన్డే ప్రపంచకప్ చరిత్రలో డబుల్ సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్‌గా మాక్స్‌వెల్ నిలిచాడు. కాగా మాక్స్‌వెల్ కన్నా ముందు 2015 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్, మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీలు సాధించారు.

5. ఈ మ్యాచ్‌లో 8వ వికెట్‌కు మాక్స్‌వెల్, కమిన్స్ కలిసి ఏకంగా 202 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో ఏడు లేదా అంతకన్నా కింది వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో 2015లో న్యూజిలాండ్‌పై 7వ వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, ఆదిల్ రషీద్ రికార్డును మాక్సీ, కమిన్స్ బద్దలుకొట్టారు.

6. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ 128 బంతుల్లోనే డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డే ఫార్మాట్లో వేగంగా డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీని కొట్టాడు. దీంతో మాక్స్‌వెల్ టీమిండియా ఆటగాడు కిషన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.

7. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ 10 సిక్సులు కొట్టాడు. ప్రపంచకప్ మొత్తంలో మాక్స్‌వెల్ ఇప్పటివరకు 33 సిక్సులు కొట్టాడు. దీంతో ప్రపంచకప్ మొత్తంలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(49), రోహిత్ శర్మ(45) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

Updated Date - 2023-11-08T14:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising