ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World cup: భారత్ vs పాకిస్థాన్ పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

ABN, First Publish Date - 2023-10-14T11:47:14+05:30

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్ష 30 వేల మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ ప్రారంభంకానుంది.

అహ్మదాబాద్: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్ష 30 వేల మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎలా ఉండనుంది? మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.


పిచ్ రిపోర్టు

నరేంద్ర మోదీ స్టేడియంలో సాదారణంగా రెండు రకాల పిచ్‌లను ఉపయోగిస్తుంటారు. ఒకటి రెడ్ సాయిల్ పిచ్ కాగా మరొకటి ఫ్లాట్ పిచ్ ఉంటుంది. రెడ్ సాయిల్ పిచ్ ఉపయోగిస్తే స్పిన్నర్లకు సహకరిస్తుంది. అప్పుడు తుది జట్టులో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించడం ఖాయం. కాబట్టి శార్దూల్ ఠాకూర్‌ను పక్కన పెట్టి రవిచంద్రన్ అశ్విన్‌ను టీమిండియా తుది జట్టులోకి తీసుకుంటారు. ఈ మైదానం పెద్దది కావడంతో అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌గా దొరికిపోతారని అంటున్నారు. అదే జరిగితే పాకిస్థాన్‌కు తిప్పలు తప్పకపోవచ్చు. పైగా ఆ జట్టులో మంచి స్పిన్నర్లు కూడా లేరు. అలా కాకుండా ఫ్లాట్ పిచ్ ఉపయోగిస్తే పేసర్లకు సహకారం ఉంటుంది. టీమిండియా తుది జట్టులో అశ్విన్‌కు బదులు శార్దూల్ ఠాకూర్ లేదా మహ్మద్ షమీని ఆడిస్తారు. ఈ పిచ్‌ ఎప్పుడూ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌కు సమాన స్థాయిలో అనుకూలిస్తుంటుంది. దీంతో టాస్ ప్రభావం పెదగా ఉండకపోవచ్చు. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టవచ్చు. అయితే స్టేడియం పునర్మిణం తర్వాత ఇక్కడ మంచి స్కోర్లు నమోదవుతున్నాయి. ఇక్కడ జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయసంగా చేధించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా రెండు జట్లలోనూ టాప్ బ్యాటర్లు ఉన్నారు కాబట్టి క్రీజులో కుదురుకుంటే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా చేధించగలరు. మొత్తంగా ఈ మైదానంలో ఇప్పటివరకు 29 వన్డే మ్యాచ్‌లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 16 సార్లు, చేజింగ్ చేసిన జట్టు 13 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 237గా ఉండగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోర్ 206గా ఉంది. ఇక్కడ అత్యధిక స్కోర్ 365గా(సౌతాఫ్రికా) ఉండగా.. అత్యల్ప స్కోర్ 85గా(జింబాబ్వే) ఉంది. అత్యధిక లక్ష్య చేధన 325గా(టీమిండియా) ఉండగా.. అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్నది 196గా(వెస్టిండీస్) ఉంది. మొత్తంగా ఇక్కడ ఒక మంచి మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి

వెదర్ రిపోర్టు

మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం ఉండే అవకాశాలు లేవు. మ్యాచ్‌కు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో పూర్తి మ్యాచ్ జరగనుంది. పగటి సమయంలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండనుంది. తేమ 47 శాతంగా ఉండనుంది. 8 కిలో మీటర్ల వేగంతో మాత్రమే గాలులు ఉండనున్నాయి.

.

Updated Date - 2023-10-14T11:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising