ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: వీడు మామూలోడు కాదు.. టీమిండియా గెలిచినా 100 కోట్ల మందికి బీపీలు పెంచేశాడు..

ABN, First Publish Date - 2023-11-16T14:09:53+05:30

Daryl Mitchell: మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కోర్ బోర్డుపై ఇంత భారీ స్కోర్ ఉండడంతో ఈ మ్యాచ్‌లో మన జట్టు సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. పైగా 39 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రచీన్ రవీంద్ర కూడా ఔటయ్యాడు. కానీ ఇలాంటి సమయంలో ఒకడొచ్చాడు. అతనే డారిల్ మిచెల్.

ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. బుధవారం హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్‌పై టీమిండియా 70 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కోర్ బోర్డుపై ఇంత భారీ స్కోర్ ఉండడంతో ఈ మ్యాచ్‌లో మన జట్టు సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. పైగా 39 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రచీన్ రవీంద్ర కూడా ఔటయ్యాడు. కానీ ఇలాంటి సమయంలో ఒకడొచ్చాడు. అతనే డారిల్ మిచెల్. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అప్పటి వరకు వరకు ఫుల్ ఫామ్‌లో కనిపించిన భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ లక్ష్యం కళ్ల ముందున్నా ఏ మాత్రం భయపడలేదు. వాంఖడేలో భారత బౌలర్లపై అద్భుత పోరాటం చేశాడు. ఓవైపు కండరాలు పట్టేసి నొప్పి బాధిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా బ్యాట్‌తో యుద్ధమే చేశాడు. 100 కోట్ల మంది భారతీయులకు బీపీ పెంచేశాడు. ప్లేయర్లతో పాటు అభిమానులనూ భయపెట్టేశాడు. క్రీజులో ఉన్నంత సేపు దడ దడ లాడించాడు. దీంతో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుపోతాడేమో అని అభిమానులు టెన్షన్ పడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియాను 3 చెరువుల నీళ్లు తాగించాడు.


మిచెల్ దెబ్బకు 2019లో మాదిరిగా మరోసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు షాక్ తప్పదేమో అని అంతా అనుకున్నారు. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు. స్టేడియంలో ఉన్న అభిమానులే కాదు. టీవీల్లో మ్యాచ్‌ను చూసిన వారికి కూడా ఏం జరుగుతుందో అనే ఆందోళన పెరిగిపోయింది. అంతలా డారిల్ మిచెల్ విధ్వంసం సాగింది. గ్యాప్ చూసి షాట్లు కొట్టడమే కాదు. ఫీల్డర్ల మీద నుంచి బంతిని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్‌తో కలిసి భారీ పార్ట్‌నర్‌షిప్‌నూ నమోదు చేశాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన డారిల్ మిచెల్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. మెరుపులు మెరిపించాడు. 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మిచెల్ మరింత రెచ్చిపోయాడు. ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ, గాయం బాధిస్తున్నప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. భారత బౌలర్లను ఊచకోత కోస్తూ కివీస్‌ను గెలుపు వైపు నడిపించాడు. మొత్తంగా 119 బంతులు ఎదుర్కొని 134 పరుగులు సాధించాడు. మిచెల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే షమీ వేసిన 46వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు. దీంతో మిచెల్ అద్భుత పోరాటం ముగిసింది. మిచెల్ ఔట్ అయ్యాక మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. ఒక వేళ మిచెల్ చివరి వరకు ఆడి ఉంటే టీమిండియా ఓడిపోయదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా న్యూజిలాండ్ ఓడిపోయినప్పటిమి మిచెల్ మాత్రం టీమిండియాను భయపెట్టాడు. ఒత్తిడిలోనూ కేన్ విలియమ్సన్‌, ఫిలిప్స్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

తన అద్భుత ఆటతో డారెల్ పలు రికార్డులను కూడా అందుకున్నాడు. ఒక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన కివీస్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 17 సిక్సులు కొట్టిన కొట్టిన మెకల్లమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 18 సిక్సులున్నాయి.

ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని మిచెల్ లాగి కొట్టాడు. దీంతో మిచెల్ బాదిన షాట్‌కు బాల్ 107 మీటర్ల దూరంలో పడింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బిగ్ సిక్సర్‌గా నిలిచింది. శ్రీలంకపై శ్రేయస్ అయ్యర్ కొట్టిన షాట్‌కు బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది. అయ్యర్ రికార్డును మిచెల్ అధిగమించాడు.

ఈ వరల్డ్ కప్‌లో భారత్ మీదనే మిచెల్ రెండు సెంచరీలు చేశాడు. ధర్మశాల వేదికగా రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ మిగతా బ్యాటర్లంతా విఫలం అయినప్పటికీ మిచెల్ మాత్రం చెలరేగాడు. తాజాగా సెమీస్‌లో మరోసారి సెంచరీ కొట్టాడు.

Updated Date - 2023-11-16T15:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising